రాష్ట్ర ఎన్నికల సంఘంతో అమీతుమీ తేల్చుకోవడానికి రాష్ట్రప్రభుత్వం సిద్ధపడింది. స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ ఈ విషయమై రెండింటి మధ్య లేఖల యుద్ధం మొదలైంది. ఒకదానికొకటి ఘాటుగా సమాధానం ఇచ్చుకోవడం మొదలైంది. జిల్లా కలెక్టర్లతో బుధవారం నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్ తో ఇది పరాకాష్టకు చేరనుంది.
కరోనా వ్యాప్తి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అర్థంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. తమ అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆపదవి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. దీనిపై కోర్టుకెళ్లి ప్రస్తుతం అదే పదవిలో రమేష్ కుమార్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు వివిధ పార్టీల నేతలతో సమావేశాలను నిర్వహించింది. ఈ క్రమంలో ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది.
దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఎన్నికల సంఘానికి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో కరోన వ్యాప్తి తగ్గలేదని, చలికాలం మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని, రాష్ట్ర యంత్రాంగం కరోనా కట్టడి లో నిమగ్నమై ఉందని, ఈ స్థితిలో ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పేర్కొన్నారు.
అంతేకాక బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం కనిపించడం లేదని తెలిపారు. ఈ లేఖ అందిన వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఎన్నికల సంఘం విధినిర్వహణలో ప్రభుత్వం జోక్యం సరికాదని, ఇది ఇది రాజ్యాంగ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఘాటు రిప్లై తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. గవర్నర్తో బేటీ విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. మధ్యాహ్నం తర్వాత కలెక్టర్లతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం నేపథ్యంలో కలెక్టర్లు ఎంతమంది వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు అవుతారోననే సందిగ్ధత నెలకొంది.
.

Discussion about this post