చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలో గల భ్రమరాంబిక సమేత మల్లిఖార్జున స్వామి ఆలయానికి ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనరు ఏకాంబరం తెలిపారు.
ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర దేవాదాయశాఖ ఆదేశాల మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
అర్హులై.. ఆసక్తి గల వారు ప్రకటన వెలువడిన 20 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏకాంబరం విజ్ఞప్తి చేశారు.
.