సానుకూల దృక్పథంతో మానసిక ఒత్తిళ్లను శక్తిగా మార్చుకోవాలని ఏపీ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సూచించారు. గురువారం కడపలోని ఎస్ వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆయన మానసిక వికాసం – ఒత్తిళ్లకు పరిష్కారం అన్న అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఆధునిక సమాజంలో పెరుగుతున్న పోటీని తట్టుకోలేక విద్యార్థులు ఇతర వర్గాల ప్రజలు ఒత్తిళ్లకు గురవుతున్నారని చెప్పారు. దీర్ఘకాలిక ఒత్తిళ్ళ వల్ల మానసిక, శారీరక రుగ్మతలు, డిప్రెషన్ బారిన పడుతున్నారని తెలిపారు.
మానసిక వికాసం పెంపొందించుకోవడం ద్వారా ఒత్తిళ్లను వరాలుగా మార్చుకోవచ్చుని చెప్పారు. దీనికి సానుకూల దృక్పథం, సమయస్ఫూర్తి , పరిష్కార యుక్తి, ఎదుర్కునే శక్తి ,, నైపుణ్యాలు తోడ్పడతాయని వివరించారు.
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని గెలుపుకు పునాదిగా మార్చుకోవాలన్నారు. జీవితంలో ఎదురయ్యే అనేక రకాల ఒత్తిళ్ళను నిర్వహించు కోవడమే తప్ప, నివారణ మార్గాలు ఉండవన్నారు. శారీరక వ్యాయామాలు, సత్సంబంధాలు, ధ్యానం, విశ్రాంతి, నిద్ర, తదితర మార్గాల ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని తెలిపారు.
తమకు తగిన లక్ష్యాలను ఎంచుకుని, ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలతో సాధించి జీవితాన్ని సఫలం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి వీరనారాయణ రెడ్డి ,విద్యార్థులు పాల్గొన్నారు.
.

Discussion about this post