ఈ నెల 26 27 తేదీల్లో రెండు రోజుల పాటు AITUC 15 వ జిల్లా మహాసభలు తిరుపతి నగరం లో జరుగుతున్న సందర్భంగా ఈ సభలను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు కోరారు.
చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా AITUC నాయకులు శ్రీ రాములు, చంద్రశేఖర్ రెడ్డి, నాగరాణి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల కాలంలో ఏఐటీయూసీ నిర్వహించిన పోరాటాలను ఈ మహాసభల్లో సమీక్షిస్తారన్నారు.
రానున్న కాలంలో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాల ప్రణాళికకు ఈ మహాసభలో రూపకల్పన జరుగుతుందన్నారు.
అలాగే నూతన నాయకత్వం ను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలోని కార్మికవర్గం పెద్దఎత్తున ఈ మహాసభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 19వ తేదీ చంద్రగిరి నియోజకవర్గ మహాసభను జయప్రదం చేయాలని కూడా ఈ సందర్భంగా కార్మికులు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎన్ శ్రీరాములు చంద్రశేఖర్ రెడ్డి నాగరాణి మండల నాయకులు రవిచంద్ర, గిరి, ఇ ఎల్లయ్య, వెంకటేశు తదితరులు పాల్గొన్నారు
.