భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన కృషిని మరువలేమని పలువురు వక్తలు పేర్కొన్నారు.
తెలుగు జాతి ఉండే వరకు పొట్టి శ్రీరాములు త్యాగం నిలచి ఉంటుందని చిత్తూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ కట్టమంచి పురుషోత్తంరెడ్డి అన్నారు.
పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గిరిం పేట లోని గంగినేని చెరువు వద్ద గల పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు అని, ఆయన చూపిన అహింసా మార్గాన్ని ఆ చరిస్తే మరింత ముందుకు పోవాలని అన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డిలతో పాటు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు కట్టమంచి బాలకృష్ణ రెడ్డి, సుందర నాయుడు, పండ్ల పరిశ్రమ సమాఖ్య కార్యదర్శి గోవర్ధన్ బాబీ, రాహుల్ రెడ్డి , కవయిత్రి అరుణ, మాలతి, రామ్మూర్తి రెడ్డి రైతు వెంకటాచలం నాయుడు తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు.
Discussion about this post