స్పందన ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి అని జిల్లా ఎస్పీ ఎస్. సెంథిల్ కుమార్ పోలీసులకు పిలుపు ఇచ్చారు. సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో 18 ఫిర్యాదుల జిల్లా ఎస్పీ ఎస్. సెంథిల్ కుమార్ స్వీకరించారు.
స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఎస్. సెంథిల్ కుమార్ ఆదేశించారు.
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి 18 ఫిర్యాదులను స్వీకరించారు.
జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా జిల్లా ఎస్పీ ఎస్. సెంథిల్ కుమార్ గారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ ఫిర్యాదులకు స్పందిస్తూ త్వరిత గతిన విచారణ జరిపి ఫిర్యాదు దారులకి న్యాయం చేయాలని సంభందిత అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల వివరాలు.. వేధింపులు –3, చీటింగ్ – 3, ఆస్తి తగాదాలు – 4, మిస్సింగ్ – 1, కుటుంబ తగాదాలు- 5, పోలీసు సేవలు – 1, అనుమానాస్పద మృతి – 1 ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో RSI శ్రీ గోపాల్ పాల్గొన్నారు.
.