ఇది అందరికీ శుభవార్త. అటు పీఆర్సీ విషయంలో ప్రభుత్వమ్మీద ధ్వజమెత్తి ఉద్యమం సాగిస్తున్న ఉద్యోగ వర్గాలకు, ప్రజలకు, ప్రభుత్వానికి కూడా శుభవార్త. గురువారం విజయవాడ వీధులన్నీ ఉద్యోగ జన ప్రవాహంతో వెల్లువెత్తిన తరువాత.. ప్రభుత్వం వైఖరిలో మార్పు వచ్చింది. ఒకటి కాదు.. ఎక్కువ మెట్లే దిగివచ్చింది.
ఏ విషయంలోనూ పునరాలోచన లేదని ఒకవైపు అంటూనే.. సమస్యలుంటే చర్చలకు రావాలని ప్రకటించిన ప్రభుత్వ ప్రతినిధులు.. మొత్తానికి కొన్ని డిమాండ్ల విషయంలో బేషరతుగా ఆమోదం తెలిపారు. ఉద్యోగులు ఇంకా ఏ సంగతి తేల్చలేదు. శనివారం సాయంత్రానికి క్లారిటీ వస్తుంది. అది కాస్తా శుభవార్తే అవుతుందనే నమ్మకం అందరిలోనూ ఉంది.
తమ డిమాండ్లను కొన్నింటిని అయినా ఆమోదించడానికి ప్రభుత్వం ఒప్పుకున్నది గనుక.. ఇది ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం మరింత అపకీర్తి పాలుకాకుండా బజార్న పడకుండా సయోధ్య కుదురుతున్నది గనుక ఇది ప్రభుత్వానికి శుభవార్త. సమ్మెలాంటిది ఉండబోవడం లేదు గనుక.. ప్రజలందరికీ కూడా ఇది శుభవార్త.
ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ల విషయంలో ఎంత దృఢంగా వ్యవహరించినప్పటికీ.. వారు మెత్తబడక తప్పలేదు. ఉద్యోగులు పిలుపు ఇచ్చిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని అణచివేసినట్లయితే.. సక్సెస్ కాకుండా అడ్డుకుని ఉన్నట్లయితే.. ప్రస్తుత పరిణామాలు మరో రకంగా ఉండేవనడంలో సందేహం లేదు. విజయవాడ దాకా అసలు ఉద్యోగులు చేరుకోకుండా అనేక రకాలుగా అడ్డుకోవాలని ప్రయత్నించిన ప్రభుత్వం విఫలమైంది. అనూహ్యమైన రీతిలో జనస్పందనతో ఛలో విజయవాడ సక్సెస్ అయిన తర్వాత.. వారి వైఖరిలో మార్పు వచ్చింది.
అప్పటిదాకా ఒక తీరుగా మాట్లాడిన ప్రభుత్వ పెద్దల స్వరంలో హఠాత్తుగా మార్పు వచ్చింది. ఈ సక్సెస్ ప్రభుత్వంలో కంగారు పుట్టించిందనడనంలో సందేహం లేదు. దాంతో చర్చల స్వరూపం కూడా మారిపోయింది. అప్పటిదాకా.. చర్చల పేరుతో పిలిచి చాయ్ బిస్కట్ ఇచ్చి పంపుతున్నారు అని ఆగ్రహించిన ఉద్యోగులు.. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు చర్చలకు కూర్చుంటే రాత్రి ఒంటిగంట వరకు, మధ్యలో చిన్న విరామంతో ఆరుగంటలపాటు అవి కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రస్తుతానికి అదనంగా ఇచ్చిన రికవరీ ఏమాత్రం ఉండబోదనే విషయంలో స్పష్టమైన హామీ వచ్చేసింది. ఉద్యోగులకు ఇది పెద్ద ఊరట. హెచ్ఆర్ఏ, సీసీఏ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. క్వాంటం పెన్షన్ల విషయం కూడా ప్రభుత్వం కొంత మెత్తబడ్డట్టే కనిపిస్తోంది.
ఉద్యోగుల వైపు నుంచి ఇంకా మెత్తబడ్డ సంకేతాలు బహిరంగంగా రాలేదు గానీ.. వారు కూడా పట్టు విడుపు ధోరణితోనే ఉన్నట్టు తెలుస్తోంది. అంతిమంగా.. ఫిట్మెంటు విషయంలో పట్టు సడలించేసి ఇతర డిమాండ్లను నెరవేర్చుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ.. ఆర్టీసీ, వైద్య వర్ ఉంది. ఏది ఏమైనప్పటికీ.. ఆర్టసీగాలు సహా ప్రభుత్వ ఉద్యోగుల వర్గం మొత్తం సమ్మె బాట పడితే.. ఎదురుకాగల ఇబ్బందులు, ఏర్పడగల అస్తవ్యస్త పరిస్థితుల నుంచి విముక్తి లభించడం ఏపీ ప్రజలందరికీ శుభవార్త. ుషయంలో ప్రభుత్వమ్మీద ధ్వజమెత్త
.
Discussion about this post