భారతదేశంలో గోవులకున్న ప్రాధాన్యత ఎంతగానో ఉంది. ముఖ్యంగా హిందువులకు గోవు పూజనీయం. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని హిందువుల నమ్మకం. మరి అలాంటి గోవులకోసం, వాటి సంరక్షణకోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే… గోవుల్ని పూజించే వారికి అది మరీ అద్భుతం. అలాంటి అద్భుతమైన నిర్ణయాన్నిమధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకున్నారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, భార్య సాధనా సింగ్ చౌహాన్ తో కలిసి తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారు జామున వీఐపీ బ్రేక్ దర్శనం సందర్భంగా వారు శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
అనంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొని, బేడీ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కేఎస్ జవహర్ రెడ్డి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి తదితరులు చౌహాన్ దంపతులకు శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకుని అతిథిగృహానికి చేరుకున్నారు.
ఇవీ చదవండి : బాల్యంలో రామాయణ మహాభారతాలు విని.. సంస్కారాలు నేర్చుకున్న అమెరికా ప్రెసిడెంట్ 21 న తిరుమల వేంకటేశ్వరునికి పుష్పయాగం తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో చతుర్ముఖ పారాయణం
ఆ కొద్ది సేపటికే శివరాజ్ సింగ్ చౌహాన్ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో గోవుల సంక్షేమానికి కొత్తగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పశు సంవర్ధకం, అటవీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, హోమ్, రైతాంగ సంక్షేమ శాఖలను ఇందులో ఈ కేబినెట్‌లో భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న తొలి కేబినెట్ సమావేశంలో గోవుల సంక్షేమ శాఖపై తీర్మానం చేస్తామని ఆయన తెలిపారు. 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అగర్ మల్వా గోవుల అభయారణ్యంలో గల గోపష్టమిలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించ తలపెట్టినట్లు ఆయన వెల్లడించారు
.

Discussion about this post