రామాయణం, మహాభారతం లాంటి కథలు మనకు జీవితంలో చాలా నేర్పుతాయి… ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, వేరు వేరు పరిస్థితులను ఎలా తట్టుకోవాలి… ఇలాంటివన్నీ. అంతే కాదు, ఈ రెండు పురాణాలలో లేని ఘటన ప్రపంచంలో మరెక్కడా ఉండదని, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు సమస్తం ఇందులో ఉంటాయని పెద్దలు అంటుంటారు. అంటే, మనం జీవితంలో ఏది అనుభవించినా కూడా, వీటిల్లో లేని పరిస్థితి ఒక్కటి కూడా ఉండదు.
అలాంటి మహాద్భుతమైన కథలను వింటూ ఒక అమెరికా రాష్ట్రపతి పెరిగాడంటే నమ్మగలమా?? నమ్మలేమేమో. కానీ, నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే, బరాక్ ఒబామా అనే మాజీ రాష్ట్రపతి, చిన్నప్పుడు ఇండొనేషియాలో ఉంటూ, హిందూ పురాణాలు అయిన రామాయణం, మహాభారతం కథలు వింటూ పెరిగాడని తనే స్వయంగా చెప్పాడు. అదే కారణం వల్ల తనకు భారత దేశం పట్ల తన మనసులో ఒక ప్రత్యేక స్థానం ఉందని కూడా చెప్పాడు.
మన దేశానికి, జీవన విధానానికి అనువైన పురాణ గ్రంథాలు అయిన మహాభారత రామాయణాలను వింటూ మన బాల్యం గడవడం, ఆ కథల్లోని నీతి సారాంశాల్ని గ్రహిస్తూ మనం పెరగడం గొప్ప విషయం కాదు. కానీ.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా.. పనిచేసిన బరాక్ ఒబామా బాల్యం కూడా అచ్చం ఆ గ్రంథాల్లోని నైతికవిలువల పునాదులనే అందిపుచ్చుకున్నదంటే మనకు సంతోషం అనిపిస్తుంది. బరాక్ ఒబామా తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా నిత్యం చేతిలో ఒక చిన్న హనుమంతుడి బొమ్మను పెట్టుకుని ఉంటాడనే సంగతి కూడా అందరికీ తెలిసిన సంగతే!
భారత దేశానికి ఉన్న పరిమాణము, ప్రపంచ జనాభాలో ఆరవ వంతు జనాభా ఉండడం, కొన్ని వేల రకాల జాతులకు చెందిన ప్రజలు, కొన్ని వందలకు పైగా భాషలు… ఇవన్నీ కూడా ఈ దేశాన్ని ఇష్టపడడానికి కారణాలు అవ్వచ్చు అని తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ లో ఒబామా రాశాడు. 2010లో ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు తప్ప ఇండియాకి ఎప్పుడూ వెళ్లకపోయినా కూడా ఆ దేశం అంటే ఎప్పటికి తనకు ‘స్పెషల్’ అని కూడా అన్నాడు.
ఒబామా తన పుస్తకంలో రాశాడు, ‘భారత దేశం కోసం నాకున్న ప్రేమ చిన్నప్పుడు ఆ దేశంకు చెందిన కథలు వినడం వల్లనో, లేదా తూర్పు మతాల మీద నాకున్న ఆసక్తో, లేదా కాలేజీలో నాకున్న పాకిస్తాన్ లేదా భారత దేశం కు చెందిన స్నేహితులు కూడా అయి ఉండచ్చు.’ అని ఆయన పేర్కొన్నారు.
.

Discussion about this post