అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వర స్వామివారికి ఈనెల 21వ తేదీన పుష్పయాగం నిర్వహించనున్ానరు. ప్రతి ఏటా ఆగమ శాస్త్రోక్తంగా జరిగే ఈ పుష్పయాగానికి ఈనెల 20న అంకురార్పణ ఉంటుంది.
ప్రతి ఏటా కార్తీక మాసం శ్రవణా నక్షత్రం పర్వదినాన పుష్పయాగం తిరుమల తిరుపతి దేవస్థానాల వారు నిర్వహిస్తారు.
కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఈ ఏడాదిలో అధికమాసం కారణంగా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు వచ్చినప్పటికీ.. రెండింటినీ కూడా.. ఆలయం అంతర్భాగంలోనే ఏకాంతంలో మాత్రమే నిర్వహించారు. అదే మాదిరిగా పుష్పయాగం కార్యక్రమాన్ని కూడా ఏకాంతంలోనే నిర్వహించడానికి అధికారులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
పుష్పయాగం కార్యక్రమంలో భాగంగా.. ఉభయ దేవేరులు శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి వారికి టన్నుల కొద్దీ వివిధ రకాల పుష్పాలతో పూజ చేస్తారు. స్వామివారికి అంగరంగ వైభోగంగా జరిగే ఉత్సవాల్లో కనుల పండువగా ఉండేవాటిలో ఇది కూడా ఒకటి.
ఇది కూడా చదవండి:
తిరుపతి ఎంపీ బరిలో తొడకొట్టడానికి టీడీపీ రెడీ
.

Discussion about this post