• About Us
  • Contact Us
  • Our Team
Sunday, July 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : పశువులకంటే మనం ఎలా గొప్ప?

admin by admin
October 22, 2021
0
Good Morning : పశువులకంటే మనం ఎలా గొప్ప?

ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేప్పుడు ప్రతిప్రాణిలోను ఉండేది ఒకే భగవంతుడు అనే అందరూ అంటూ ఉంటారు. మరి అన్ని ప్రాణులూ సమానంగా భగవత్ స్వరూపాలే అయినప్పుడు.. ఇతర జంతువుల కంటె మనుషులు ఎలా గొప్ప? జంతువుల నుంచి మనల్ని వేరు చేస్తున్నది ఏంటి?

‘ధర్మం’, ధర్మాచరణతో కూడిన జీవనం మనుషుల్ని జంతువులనుంచి వేరు చేస్తాయని పెద్దలు చెబుతుంటారు. ఒక క్రమబద్ధమైన జీవన శైలి, కొన్ని నియామాలను విధివిధానాలను నిర్దేశించుకుని.. వాటికి అనుగుణంగా జీవనం గడపడమే మనుషులను జంతువుల కంటె మెరుగైన ప్రాణిగా నిలబెడుతోందనేది కూడా అందరూ ఒప్పుకునే సంగతి.

ఈ విషయం కూడా కొత్తది కాదు. ఈ విషయాన్ని ఓ సుభాషితం ఇలా చెబుతుంది..

ఆహార నిద్రా భయ మైథునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణామ్
ధర్మో హి తేషామ్ అధికోవిశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః

తిండి, నిద్ర, భయం, రతి లాంటివన్నీ మనుషులతో సహా అన్ని రకాల జంతువుల్లోనూ ఒకే తీరుగా ఉంటాయి. అయితే ధర్మం ఒక్కటే.. మనుషులను.. ఇతర జంతువుల నుంచి వేరు చేస్తుంది. ధర్మం లేని వాడు.. ఆచరించని వాడు పశువుతో సమానం.  .. అని చెబుతుంది ఈ సుభాషితం.

ఇంతవరకు కొత్త విషయమేం కాదు. కానీ.. ధర్మం అంటే ఏమిటి? ఏ విషయాన్ని మనం ధర్మంగా భావించాలి. ఈ మీమాంస ప్రతి ఇద్దరు మనుషులకు మధ్య మారుతుంటుంది.

అయితే ధర్మం అంటే ఏమిటో మరో సుభాషితం మనకు చాలా సరళంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది.

ధారణాత్ ధర్మమిత్యాహుః ధర్మో ధారయతే ప్రజాః
యస్యాత్ ధారణ సంయుక్తమ్ స ధర్మ ఇతి నిశ్చయః

ధర్మం అనే పదమే.. ధారణ అనే క్రియ నుంచి ఆవిర్భవించింది. ధారణ అంటే సమాజాన్ని కలిపి ఉంచేది. కాబట్టి.. ప్రజలందరినీ కూడా సమైక్యంగా, కలిపి ఉంచేది ఏదైతే ఉంటుందో.. అదే ధర్మం అనిపించుకుంటుంది.

హిందూత్వం మతం కాదు ధర్మం అని కొందరు అంటుంటారు. ధర్మానికి సంబంధించిన ఈ నిర్వచనం ప్రకారం.. కేవలం హిందూత్వం మాత్రమే కాదు.. ఒక జన సమూహాన్ని సమైక్యంగా ఉంచే ఏ విశ్వాసం అయినా సరే, నమ్మకం అయినా సరే.. అది ధర్మమే.

ఒక సమూహాన్ని సమైక్యంగా ఉంచుతున్నదంటే.. వారందరి ఆమోదం పొందినట్టే లెక్క. అలా సర్వజనామోదం పొందిన ప్రతి విషయమూ కూడా ఆ సమూహానికి ధర్మమే అనిపించుకుంటుంది. ఒకరి విశ్వాసాల పట్ల మనకు అపనమ్మకం ఉండొచ్చు. మనం విభేదించవచ్చు. కానీ.. అది ఆ సమూహానికి ‘ధర్మమే’ అనే సత్యం బోధపరచుకున్నప్పుడు.. మనం విభేదిస్తే.. దూరంగా ఉండాలే తప్ప- ఖండించడం తగదు అనే విచక్షణ అలవాటు చేసుకుంటే బహుశా మన సమాజంలో ఎటువంటి అశాంతి కూడా ఉండదు.

శుభోదయం

Tags: BhartrihariBhartrihari subhashithamgood morninggood morning thoughtquotes on agriculturequotes on good thoughtssubhashitamsubhashithamwhat is dharmawhat to sowwhat you sow is what you reapధర్మంధర్మం అంటే ఏమిటిధర్మార్థంధారణభర్తృహరి సుభాషితంమంచిమాటశుభోదయంసుభాషితం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply