ప్రస్తుతం సీజన్ ఎలా మారిపోయిందంటే.. నలుగురిలో ఉన్నప్పుడు చిన్నగా తుమ్మితే చాలు.. చుట్టూ ఉన్న నలుగురూ మన నుంచి కాస్త దూరం జరుగుతారు. మనల్ని అనుమానంగా చూస్తారు. ఒక రోజంతా.. జలుబుతో ఎగచీదుతూ కనిపించామంటే చాలు.. రెండో రోజు మన వద్దకు ఎవరూ రారు. ఆఫీసుల్లో సెలవు ఇచ్చేస్తారు. చిన్న పాటి జలుబు- జ్వర లక్షణాలు ఏమాత్రం కనిపించినా.. కొవిడ్ అనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది.
ఇతరు సంగతి ఎందుకు.. మనం ఒకసారి తుమ్మామంటే.. ‘ఏమో కొవిడ్ సోకిందేమో’ అనే భయం మనకే పుడుతుంటుంది. టెస్టులు చేయించుకోవాలని అనిపిస్తుంది. కానీ కార్పొరేట్ ఆస్పత్రులకు టెస్టులకోసం వెళ్లాలంటే.. లక్షల్లో బిల్లులు వాయించేస్తారేమో అని అది ఒకభయం. అధిక వ్యయం గురించి భయపడుతూ.. చిన్న చిన్న లక్షణాలు కనిపించినప్పుడు.. ఉపేక్షించి రెండురోజుల అలాగే ఉంటే అప్పుడు చూసుకుందాం లెమ్మని అనుకునే వారు బోలెడు మంది. అయితే- ఒకవైపు కొవిడ్ టెన్షన్ లోనే గడుపుతూ.. టెస్టులకు వెనకాడే వారికి శుభవార్త. కొవిడ్ టెస్టులు చేయించుకోడానికి ఫీజులను భారీగా తగ్గించారు.
ఇవీ చదవండి : అయోధ్య ఒక అద్భుతాన్ని నమోదు చేసింది.. అదేంటో తెలుసా? గోవులకోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్న గొప్ప పని ఏంటో తెలుసా? ఒబామా సంస్కారాలన్నీ మన పురాణాల్లోంచే నేర్చుకున్నాడు తెలుసా?
తెలంగాణలోని వైద్యశాఖ అధికారులు కరోనా టెస్టులు చేయించుకోడానికి నిర్దేశించిన ధరలను భారీగా తగ్గించారు. ఇదివరకు ఉన్న ధరలతో పోలిస్తే.. యాభై శాతానికంటె దిగువకు తగ్గిస్తూ వైద్య శాఖ ఉత్తర్వులు వెలువరించడం విశేషం. కొవిడ్ ను దాదాపు కరెక్టుగా నిర్ధరించే ఆర్టీ పిసిఆర్ టెస్టుకు ప్రస్తుతం ల్యాబులు 2200 రూపాయల వంతున వసూలు చేస్తున్నాయి. ఈ ధరణఉ ఇకమీదట 850 రూపాయలు మాత్రమే ఉండేలా నిర్ణయించారు. మన ఇంటివద్దకే వచ్చి శాంపిల్స్ తీసుకువెళ్లి.. పరీక్షలు చేయించి ఫలితం చెప్పడానికి హోం సర్వీస్ కోసం గతంలో 2800 ల రూపాయల ధర ఉండేది. దీనిని కూడా 1200 ల రూపాయలకు తగ్గించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమంగా కొవిడ్ కేసులు తగ్గుతున్నాయి. ప్రజలు కూడా కొవిడ్ లక్షణాల గురించి అనుమానం వస్తే.. వెంటనే పరీక్షలు చేయించుకుని నివృత్తి చేసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
.

Discussion about this post