దీపావళి నేపథ్యంలో ఈసారి గ్రీన్ క్రాకర్స్ అనే పదం బాగా వినిపిస్తోంది. ఇంతకీ గ్రీన్ క్రాకర్స్ అంటేు ఏంటి? అవి నిజంగానే అంత పర్యావరణ మైత్రి ఉన్నవా? ఇంతకీ వాటిని గుర్తించడం ఎలాగ? అందరికీ అందుబాటు ధరల్లోనే ఉంటాయా? పేదలు కూడా వీటిని కొనడం సాధ్యమేనా? వీటివల్ల ఎలాంటి కాలుష్యానికి ఆస్కారం లేదా..? ప్రస్తుతం వాటి వినియోగంలో ఉన్న సాధ్యాసాధ్యాలు ఏమిటి? అలాంటి అన్ని వివరాలు తెలిసేలా.. ఆదర్శిని డాట్ కామ్ దీపావళి సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఈ మధ్య మన ప్రపంచం మరీ దారుణంగా కలుషితం అవుతోంది. ఓజోన్ లేయర్ గురించి మనందరికీ చాలా రోజులు, కాదు, ఏళ్ల నుంచి తెలిసిందే. నిజానికి ఓజోన్ లేయర్ దగ్గర ఏమవుతుందంటే, అక్కడ మోనో ఆక్సైడ్ మాలెక్యూల్స్ ఇంక ఆక్సీజెన్ మాలెక్యూల్స్ ఉంటాయి. సూర్యకాంతి వలన ఈ రెండూ కలిసిపోయి, ఓజోన్ (ఓ 3) గా ఉంటాయి. ఈ ఓజోన్ అనేది నిజానికి చాలా హానికారి. కానీ, ప్రతి ఒక్కదానికి ఒక మంచి గుణం, ఒక చెడ్డ గుణం ఉంటుంది అన్నట్టు, ఓజోన్ లేయర్ కి కూడా మంచి గుణం ఉంది. అది మనల్ని సూర్యుడి నుంచి వచ్చే హానికారకమైన అల్ట్రా వయొలెట్ కిరణాలనుంచి కాపాడడం. అయితే, ఇదంతా తెలుసుకున్న తరువాతే మనకి ఎందుకు కాలుష్యం మంచిది కాదో అర్థం అవుతుంది. కాలుష్యం వల్ల ఓజోన్ (ఓ 3) మళ్లీ ‘డీకంపోజిషన్ రియాక్షన్’ ద్వారా మోనో ఆక్సైడ్ మాలెక్యూల్స్ ఇంక ఆక్సీజెన్ మాలెక్యూల్స్ లోకి మారిపోతుంది. ఇది గనుక కొనసాగుతూనే ఉందంటే, మన ప్రాణాలకి మాత్రమే కాదు, భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క జీవికీ ప్రమాదమే.
మన పరిసరాలను కాలుష్యం చేయడంలో ప్రథాన పాత్రలు పోషించేవి ప్లాస్టిక్, టపాసులు. ఈ మధ్య, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్. జీ. టీ) అనేది ‘ఒక మాదిరిగా కలుషితం అయి’ ఉన్న నగరాలకు ‘గ్రీన్ క్రాకర్స్’ వాడడం తప్పనిసరి అని ఒక నియమం పెట్టింది. దీనికి సంబంధించి ఆ నగరాల్లో ఉండే వాళ్లందరూ ఆలోచించడం మొదలు పెట్టారు.
తెలంగాణ బాణసంచా సంఘం దీని మీద త్వరగానే హామీ ఇచ్చింది… వాళ్లు అమ్మే టపాసులు తమిళ నాడు లోని శివకాసి నుంచి వస్తాయని… శివకాసి లో టపాసుల తయారీ సుప్రీమ్ కోర్ట్ మార్గదర్శకాలను బట్టి ఉంటుందని తెలియజేసి, ఈ సంవత్సరం అమ్ముడు పొయ్యే చాలా వరకు టపాసులు ‘గ్రీన్ క్రాకర్స్’ ఏ ఉంటాయని జే. మాణిక్య రావు (సంఘం ప్రతినిధి) మాట ఇచ్చారు. రాజేంద్రనగర్ భాగవతి బాణసంచా కంపెనీ నుంచి వేణుగోపాల్ కూడా దీనితో ఏకీభవించారు.
అసలు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏమిటి? వాటిని గుర్తించడం ఎలా?
ఇవి మామూలు టపాసులతో పోలిస్తే తక్కువ హానిని, కాలుష్యాన్ని కలిగించే సూత్రాన్ని ఉపయోగించి చేసిన టపాసులు. పర్యావరణానికి ఎక్కువ హాని కలిగించకుండా ఉంటుంది. ఇంతకీ గ్రీన్ క్రాకర్స్ ను ఇలా చేసే మంచి విషయం ఏంటా అని ఆలోచిస్తున్నారా?? గ్రీన్ క్రాకర్స్ లో అల్యూమినియం, బేరియం, పొటాషియం నైట్రేట్ ఇంక కార్బన్… ఈ రసాయనాలిని అన్నిటినీ పూర్తిగా తీసేశారు, లేదా 30 శాతం ఉద్గారాలను తగ్గించేటట్టుగా తయారు చేశారు. కొంత మేలు జరిగినా, మేలు జరిగినట్టేగా. ఇంత గొప్ప పని ఎవరు చేసుంటారు?? సీ.ఎస్.ఐ.ఆర్ వారి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రిసర్చ్ ఇన్స్‌టిట్యూట్ (నీరి) వారు తయారు చేశారు. అంతా బాగానే వుంది. కానీ, మనం కొనేవి గ్రీన్ క్రాకర్సా కాదా, అనేది కనుక్కోవడం, పెద్ద కష్టమేమీ కాదు. వాటికి ఒక క్యూ.ఆర్. కోడ్, ‘గ్రీన్ ఫైర్‌వర్క్స్’ లోగో ఇంక సీ.ఎస్.ఐ.ఆర్ వారి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రిసర్చ్ ఇన్స్‌టిట్యూట్ – ఇండియా వారి స్టాంప్ కూడా ఉంటుంది.
ఇప్పటి వరకూ చెప్పిందంతా బాగానే అనిపిస్తోంది. కానీ ఇంకో సమస్య ఉంది. విక్రేతలు ఇన్ని మంచి మాటలు చెప్పి ప్రజలకు హామి ఇస్తున్నా కూడా, నిపుణులు దీనిని పూర్తిగా నమ్మడంలేదు. గ్రీన్ క్రాకర్స్ ఇంత ఎక్కువ లభ్యతలో ఉన్నాయంటే వాళ్లకి ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపిస్తోంది. నీరి హైదరాబాద్ నాయకుడు షైక్ బాషా, గ్రీన్ క్రాకర్స్ హైదరాబాద్ మార్కెట్లలో కేవలం 30 శాతం విస్తరించి ఉంటాయి అని అంటున్నారు. ఎన్.జీ.టీ ఇంక సుప్రీం కోర్టు వాటి వాడకానికి పట్టు పట్టడం వల్ల ఈ ఎంపికకు పూర్తిగా విస్తరించడానికి సమయం పడుతుంది అని కూడా అన్నాడు బాషా.
ఇవీ చదవండి : చిరును నిందించిన వాళ్లంతా నోరు మూస్కోవాలి శకుంతలాదేవి గొప్పదనం తెలుసా? అంచనాలకు దొరక్కుండా సూపర్ హిట్ అయిన లేటెస్ట్ మూవీ పుష్కరాలకు వెళ్లకుంటే ఏమవుతుంది?
ఈ ‘ఎక్కడో తేడా కొట్టడం’ అనే దాన్ని రాఘవేంద్ర చౌధరీ అనే ఒక పంపిణీదారుడు ధృవపరిచాడు. స్టాక్‌లో నుంచి కేవలం 25-30 శాతం మాత్రమే గ్రీన్ క్రాకర్స్ అని చౌధరీ తేల్చేశాడు. ప్రతి సంవత్సరం దీపావళికి పర్యావరణానికి ఎక్కువ హాని కలిగించని టపాసులు వాడుక గురించి ఒక చర్చ వస్తుందని, చర్యలు కొద్దిగా ముందుగానే తీసుకుంటే ఈ గందరగోళం చాలా వరకూ తగ్గుతుందని తను చెప్పాడు.
రోడ్ల మీద అమ్మే చాలా విక్రేతలు తమ తమ దుకాణాలలో ఎలాంటి ‘గ్రీన్ క్రాకర్స్’ పెట్టుకోలేదు. కొంతమందికైతే అసలు వాటి అర్థం కూడా తెలీదు. బేగమ్ బజార్ లోని ఒక విక్రేత పరిస్థితి గురించి తెలిపాడు… గ్రీన్ క్రాకర్స్ అనేవి ఎక్కువగా పెద్ద కంపెనీలకే పోతున్నాయి అని, డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల తయారీ దారుల దగ్గర ఎక్కువ స్టాక్ కూడా ఉండడంలేదని చెప్పాడు.
గ్రీన్ క్రాకర్స్ అని పర్యావరణానికి చాలా బాగా ఉపయోగపడేవి తయారు చేస్తున్నాము సరే. కానీ, పెద్ద దుకాణాలు ఉన్నవాళ్లే మొత్తం కొనేసుకుంటే, చిన్న వాళ్లకి ఏమీ మిగలదు. చిన్న వాళ్లు గ్రీన్ క్రాకర్స్ అమ్మలేరు. అంటే, కొద్దిగ పేదవాళ్లు కూడా గ్రీన్ క్రాకర్స్ కొనలేరు అనేగా అర్థం. డబ్బున్న వాళ్లు మాత్రమే ఎక్కువ హాని కలిగించని టపాసులు కాల్చుకోవాలి… డబ్బులేని వాళ్లు ఎక్కువ హాని కలిగించే టపాసులు వాడాలి అన్నట్టు అనిపిస్తోంది. మన దేశంలో 25 శాతం మంది పైనే మధ్య తరగతి కుటుంబాలు, లేదా ఇంకా పేద కుటుంబాలు ఉంటాయి. ఇలాంటి కుటుంబాలు హాని ఎక్కువ కలిగించే టపాసులు వాడి, మిగిలిన కుటుంబాలు తక్కువ కలిగించే వాటిని వాడారంటే, పెద్ద తేడా ఏమీ రాదు పర్యావరణంలో. నెగెటివ్ ఇంటూ పాజిటివ్ నెగెటివ్ ఏ అవుతుంది. ఆ ముందు ఒచ్చే నెగెటివ్ కూడా పాజిటివ్ గా మారితేనే, ఫలితం పాజిటివ్ అవుతుంది.
.

Discussion about this post