మెగాస్టార్ చిరంజీవి విషయంలో తొందరపడి విమర్శలు చేసిన వాళ్లంతా ఇప్పుడు నోరు మూస్కోవాలి. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసినప్పుడు మాస్క్ పెట్టుకోలేదని, కేసీఆర్‌కు కూడా కరోనా అంటించారని.. అక్కడ భేటీలో పాల్గొన్న అందరినీ ప్రమాదంలోకి నెట్టారని ఇలా రకరకాలుగా… కొన్నిరోజులుగా చాలా మంది విమర్శలు చేశారు. అలాంటి వాళ్లందరి నోర్లు ఇప్పుడు మూతపడ్డాయి. చిరంజీవికి కరోనా పాజిటివ్ అని చెప్పడమే మెడికల్ కిట్లలో జరిగిన పెద్ద పొరబాటు అని, తాజాగా ఆయనకు మూడు వేర్వేరు వైద్య పరీక్షల్లో నిగ్గు తేల్చడంతో.. అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ‘మెగాస్టార్‌కు పాజిటివ్’ అనే వార్త రాగానే.. ఎగబడి.. మీడియా మొత్తం ఈ వార్తను విస్తృతంగా ప్రచారంలో పెట్టింది.
చిరంజీవి ప్రగతి భవన్‌కు వెళ్లడం ద్వారా కేసీఆర్ ను కూడా రిస్కులో పెట్టారని, అధికారులంతా ప్రమాదంలో పడ్డారని రకరకరాల కథలు వండి వార్చారు. చిరంజీవి చాలా పెద్ద తప్పిదం చేసినట్లుగా వ్యాఖ్యానాలు చేశారు. చిరంజీవి చేసినదెల్లా ముఖ్యమంత్రి వినతి మేరకు వర్ష బాధితులకోసం సీఎం సహాయనిధికి కోటి రూపాయలు విరాళం ఇవ్వడం. కరోనా విషయంలో ప్రజల జాగ్రత్తల గురించి ఆయన ఎంత శ్రద్ధ తీసుకుంటూ వచ్చారో తొలినుంచి అందరికీ తెలుసు. అలాంటి చిరంజీవి తనకు పాజిటివ్ అని చెప్పగానే.. ఎవరికి వారు రకరకాల నిందలు పులమడానికి ప్రయత్నించారు. కేసీఆర్ కు కూడా కరోనా అంటించినంత రేంజిలో కథనాలు వచ్చాయి. ఆదర్శిని డాట్ కామ్ మాత్రం.. ఇన్నాళ్లూ జాగ్రత్తగా ఉన్న చిరంజీవికి ఇప్పుడే ఎలా బయటపడింది.
ఇవీ చదవండి : చిరుకు అక్కడే ప్రమాదం అంటుకున్నదా? పవన్ కల్యాణ్ సహృదయసేనాని
ప్రగతి భవన్ కు వెళ్లి.. అక్కడి వారికి ఈయన అంటించారా? అక్కడకు వెళ్లడం వలన ఆయన అంటించుకుని వచ్చారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనం అందించింది. చివరికి చిరంజీవికి కరోనా లేనే లేదని రిపోర్టులు వచ్చాయి. తొందరపడి ఆయన మీద నిందలు వేసిన వాళ్లంతా ఇప్పుడు నోరు మూసుకోవాల్సిన పరిస్థితి. మీడియా అత్యుత్సాహానికి ఇది పెద్ద దెబ్బలాంటిదని భావించాలంతే.
.

Discussion about this post