తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు విచ్చేసే క్రీడాకారులకు మనం అందించే ఆతిధ్యం అందరూ మెచ్చేలా ఉండాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
కబడ్డీ పోటీల నిర్వహణకై ఏర్పాటు చేసిన కమిటీ లతో శుక్రవారం సమావేశ మందిరంలో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ గిరీషా లు మాట్లాడుతూ కబడ్డీ పోటీలు చక్కగా నిర్వహించేందుకు సుమారు 19 కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ కమిటీలు చక్కగా బాధ్యత తో విధులు నిర్వహించి ప్రతి ఒక్క క్రీడాకారుడు సంతృప్తి చెందేలా ఉండాలన్నారు. రిసెప్షన్ కమిటీ వారు క్రీడాకారుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుని వారికి ఆహ్వానం పలికి వసతి సౌకర్యాలు చక్కగా కల్పించాలన్నారు.
అలాగే వారిని గ్రౌండ్ కు తీసుకు రావడం, తిరిగి తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. భోజనం కూడా అన్ని రాష్ట్రాల వారికి సరిపోయే విధంగా ఏర్పాటు చేయాలన్నారు.
మనం అందించే ఆతిధ్యం పదికాలాల పాటు గుర్తుండేలా ఆయా కమిటీ లు జాగ్రత్తగా చేయాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, స్మార్ట్ సిటీ జి. ఎం. చంద్రమౌళి, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, ఆయా కమిటీ ల సభ్యులు పాల్గొన్నారు.
.

Discussion about this post