జనసేనాని పవన్ కల్యాణ్ మరో ప్రజాఉద్యమంలోకి నడుం బిగిస్తున్నారు. ఇటీవలే విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా ప్రత్యక్ష కార్యచరణకు దిగిన పవన్ కల్యాణ్.. విశాఖలో బహిరంగసభ పెట్టి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల మనోగతాన్ని తెలియజెప్పిన సంగతి తెలిసిందే. అలాంటి పవన్ కల్యాణ్ తాజాగా.. అమరావతి రైతులు తిరుమల వరకు చేపట్టిన మహాపాదయాత్రకు మద్దతుగా యాత్రలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొననున్నారు.
ఖరారుగా తేదీలు ఇంకా నిర్ణయించకపోయినప్పటికీ.. అమరావతి రైతులకు మద్దతు ఇస్తూ వారి డిమాండ్‌ను మరింత బలంగా వినిపించేందుకు జనసేనాని సంకల్పించినట్లు సమాచారం. అయితే అమరావతి రైతుల మహాపాదయాత్రలో జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొనడం అనేది ఎలా ఉండాలి అనే విషయంలో పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నవంబరు1న తుళ్లూరులో ప్రారంభమైన పాదయాత్ర డిసెంబరు 17న తిరుమల చేరే వరకు కొనసాగుతుంది. అయితే జనసేనాని మధ్యలో కొన్నిరోజులు పాదయాత్రలో రైతులతో పాటు నడుస్తారా లేదా, చివరి రోజుల్లో యాత్రలో పాల్గొని.. తిరుపతి చేరిన తర్వాత.. వారిని ఉద్దేశించి మాట్లాడతారా అనే నిర్దిష్ట కార్యచరణ నిర్ణయించలేదు.
అమరావతి రైతుల పోరాటానికి పవన్ కల్యాణ్ తొలినుంచి మద్దతుగానే ఉన్నారు. రాజధాని తరలించకుండా వారు దీక్షలు ప్రారంభించిన నాటినుంచి ఆయన పలుమార్లు వారి శిబిరాలను సందర్శించారు. వారి ఆవేదనను తన గళంలోంచి నినాదంగా వినిపించారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ అమరావతి రైతులకు మద్దతు తెలియజేస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో అమరావతి రైతులు మహాపాదయాత్ర ప్రారంభించడానికి ముందే.. జనసేన పెద్దలను కలిశారు. వారి మద్దతు కూడా కోరారు. రైతులు మంగళగిరి కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ ను కలిసి పాదయాత్రకు మద్దతు తెలియజేయాల్సిందిగా విన్నవించారు. జనసేన అందుకు సుముఖంగానే ఉంది. అదొక ఎత్తు కాగా.. తాజాగా అమిత్ షా కూడా మహా పాదయాత్రకు మద్దతు ఇవ్వాల్సిందిగా తమ పార్టీ శ్రేణులకు చెప్పడంతో.. పవన్ కల్యాణ్ కూడా ప్రత్యక్ష కార్యచరణతో మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
also read : జగన్.. ప్రభువు ప్రార్థన మిస్ కాకూడదనేనా? లేదా..
also read : ‘జగనన్నా ఆగలేం..’ వైఎస్సార్సీపీ ఆశావహుల గగ్గోలు
also read : బద్వేలు ఫలితం నుంచి జగన్ నేర్చుకోవాల్సిన పాఠమేంటి?
జనసేనాని ప్రత్యక్షంగా అమరావతి రైతులు మహాపాదయాత్రలో పాల్గొనడానికి ఇంకా నెలరోజుల వ్యవధి ఉంది. ఈలోగా.. పవన్ కల్యాణ్ మద్దతు తెలియజేసే సందర్భం కూడా పోరాటానికి మరింత మేలు చేసేలా ఉండేందుకు జనసేన కసరత్తు చేస్తోంది. పవన్ కల్యాణ్ ఏ రోజుల్లో ఏ ప్రాంతంలో పాదయాత్రలో పాల్గొంటే అటు ఉద్యమానికి, ఇటు పార్టీకి కూడా లాభసాటిగా ఉంటుందో లెక్కలు వేస్తున్నారు.
also read :అద్దె ఇల్లు యజమానుల్ని బెదిరిస్తున్న అధికారులు
కుప్పం వెళ్లే హక్కు చంద్రబాబుకు లేదా?
మంత్రి హరీష్ రావుకు తప్పిన ప్రమాదం
ఇంట్లో పాముల్ని వదలి.. బడా నిర్మాతకు బెదిరింపులు
తిరుపతికి చెందిన నాయకులు మాత్రం.. మహా పాదయాత్ర తిరుపతి చేరే సమయానికి పవన్ కల్యాణ్ పాల్గొంటే బాగుంటుందని.. విశాఖలో నిర్వహించిన బహిరంగ సభకు దీటుగా ఇక్కడ సభను ఏర్పాటుచేస్తామని జనసేనాని దృష్టికి తెస్తున్నట్టు సమాచారం.
పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే.. అమరావతి రైతుల పాదయాత్రకు మరింత ఊపు వస్తుందని రాజధానిని కోరుకుంటున్న వారు భావిస్తున్నారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
Discussion about this post