గ్యాంగ్‌స్టర్ గా మారిన నక్సలైట్ నయీమ్ దందాలు, బెదిరింపులు చాలా కొత్తకొత్త పద్ధతుల్లో ఉండేవి. విషపూరితమైన పాములను ఇంట్లో వదిలి బెదిరించడం అనేది గ్యాంగ్‌స్టర్ నయీమ్ ప్రత్యేకమైన స్టయిల్. నయీమ్ తను కాలేజీ చదివే రోజులనుంచి అలవాటు చేసుకున్న స్టైల్ అది.
చిత్రవిచిత్రమైన ఇలాంటి నయీమ్ బెదిరింపులకు బలైన వారు ఎందరో? అయితే.. తెలుగు ఇండస్ట్రీలో రికార్డులు బద్దలు కొట్టిన బ్లాక్ బస్టర్ చిత్రాలను కూడా నిర్మించిన ఒక బడా నిర్మాత కూడా ఈ బాధితుల జాబితాలో ఉండడమే తమాషా. అయితే.. సదరు బడా నిర్మాత మీద గ్యాంగ్‌స్టర్ నయీమ్ దృష్టి ఎలా పడింది? నయీమ్ ఉచ్చులో అతను ఎలా తగులుకొన్నాడు.. ఇదంతా కూడా ఒక తమాషా కథ.
టాలీవుడ్ లో బడా హీరోలు కొందరు తనకు దేవుళ్లు అని చెప్పుకునే ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నాడు. తన దేవుడిని హీరోగా పెట్టి రికార్డులు బద్దలు కొట్టిన చిత్రం కూడా చేశాడు. అలాంటి బడా ప్రొడ్యూసర్ కు ఒక సందర్భంలో- ఒక హీరోతో తగాదా ఏర్పడింది. 8 కోట్ల రూపాయలకు సంబంధించిన డీల్ అది.
సదరు హీరో తెలుగువాడు కాదు! ముంబాయి నుంచి వచ్చి ముచ్చటకొద్దీ తెలుగు సినిమాల్లో హీరోగా ట్రయల్స్ వేసిన వాడు. ఏదో గుట్కా వ్యాపారాలు చేసుకునే కుటుంబం నుంచి వచ్చాడు కదా.. కాస్త గట్టిగా ధమ్కీ ఇస్తే మనోడు సైలెంట్ అయిపోతాడని నిర్మాతగారు అనుకున్నారు. కానీ వ్యవహారం అంత తేలిగ్గా తేలలేదు. ఇద్దరికీ మధ్య లడాయి ముదిరింది.
also read : ‘జగనన్నా ఆగలేం..’ వైఎస్సార్సీపీ ఆశావహుల గగ్గోలు
దాంతో సదరు నిర్మాత- సెటిల్మెంటు కోసం నయీమ్ ను ఆశ్రయించాడు. ఒక బేరం కుదుర్చుకున్న నయీమ్.. సదరు ముంబాయి హీరోకి వార్నింగ్ ఇచ్చాడు. అక్కడే కథ అసలు మలుపు తిరిగింది. ముంబాయి హీరో- నయీమ్ తో తమ తగాదా మొత్తం వివరించి.. తాను మరొక బేరం ఆఫర్ పెట్టాడు. అదే బెటర్ అని నయీమ్ కు అనిపించింది. రివర్స్ గేర్ వేసి.. తనను తొలుత ఆశ్రయించిన బడా ప్రొడ్యూసర్ నే టార్గెట్ చేశాడు.
సదరు నిర్మాత కూడా ఒక పట్టాన లొగలేదు. కానీ నయీమ్ వదల్లేదు. ఆ బడా నిర్మాత ఇంట్లో నాగుపాముల్ని కూడా వదిలించాడు. పాపం ఆ ప్రొడ్యూసర్ కు వణుకు మొదలైంది. ఒకవైపు నయీమ్ బెదిరింపులు.. ఇంట్లో మళ్లీ పాములు వదులుతాడేమోననే భయం. మూడునెలలకు పైగా నిద్రాహారాలు లేకుండా గడిపాడు.. చివరికి నయీమ్ తో కాళ్ల బేరానికి వచ్చి వ్యవహారం సెటిల్ చేసుకున్నాడు.
also read : జగన్.. ప్రభువు ప్రార్థన మిస్ కాకూడదనేనా? లేదా..
నయీమ్ జీవితం కథాంశంగా ఇప్పుడు నయీమ్ డైరీస్ అనే చిత్రం రూపొందింది. మాజీ నక్సలైట్ దామూ బాలాజీ ఎంతో రీసెర్చి తర్వాత తయారుచేసుకున్న కథతో ఈ చిత్రం తీశారు. ఇందులో నయీమ్ జీవితానికి సంబంధించిన అనేక విశేషాలు.. అందరికీ తెలియని సంగతులు ఉంటాయని అంటున్నారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post