డాలస్ నగరంలోని మహాత్మాగాంధీ స్మారక స్థలి భారతీయులందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన యాత్రాస్థలి అని ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి అన్నారు. ప్రసాస భారతీయుల ఐక్యతకు, కార్యదీక్షకు మహాత్మాగాంధీ మెమోరియల్ ఒక నిలువెత్తు నిదర్శనం అని ఆయన అభివర్ణించారు. ఏపీ ప్రభుత్వానికి ఉత్తర అమెరికాలో ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన తర్వాత తొలిసారిగా డాలస్ నగర పర్యటనలో ఉన్న జయరాం కోమటి.. ఇర్వింగ్ లోని, అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారక స్థలిని ఆదివారం సదర్శించి మహాత్ముడికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాద్ తోటకూర, గవర్నెన్స్ బోర్డు సభ్యులు అనంత్ మల్లవరపు కలిసి జయరాం కోమటికి స్వాగతం పలికి జ్ఞాపికతో సత్కరించారు.
జయరాం మాట్లాడుతూ పుష్కరకాలం పూర్తిచేసుకున్న గాంధీ మెమోరియల్ ను ప్రవాస భారతీయులే గాక విదేశీ ప్రముఖులు, ఏపీ ముఖ్యమ్తంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి అనేకులు సందర్శించడం మనందరికీ గర్వకారణం అని అభివర్ణించారు. ఈ మహత్కార్యాన్ని సాకారం చేయడంలో అహరహం శ్రమించిన మెమోరియల్ ఛైర్మన్ ప్రసాద్ తోటకూర, కార్యవర్గ బృందాన్ని జయరాం అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపార వేత్త రామ్ గుళ్లపల్లి ఇంకా అనేకమంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.
.
Discussion about this post