అయ్యన్నపాత్రుడు విమర్శలు- చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి వ్యవహారంలో జోగి రమేష్ ఒక రకంగా సొంత పార్టీలోనే ఏకాకి అయిపోయారా? ఇప్పుడు పార్టీలో పరిస్థితుల్ని గమనిస్తే అలాగే అనిపిస్తోంది.
‘ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాలినా సహించే వాడిని కాదు’ అని తనను తాను ప్రొజెక్టు చేసుకోవడానికి ఆయన చాలా అత్యుత్సాహంతోనే పనిచేశారు గానీ.. ఆశించినంత ఫలితం లభించినట్టుగా మాత్రం లేదు.
అయ్యన్నపాత్రుడు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి తూలనాడిన తర్వాత.. జోగి రమేష్ రెచ్చిపోయి, చంద్రబాబు ఇంటిమీద పడ్డారు. ఆ వ్యవహారం పెద్ద రగడగానే మారింది. అయితే.. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే కేబినెట్ ను విస్తరిస్తారనే సర్వత్రా వినవస్తున్న నేపథ్యలో..
ఇదంతా కూడా.. తన ఇమేజి పెంచుకోవడానికి.. కేబినెట్ రేసులో ముందడుగు వేయడానికి జోగిరమేష్ డ్రామాగా అందరూ అనుకున్నారు. నిజానికి పార్టీలో కూడా అదే అభిప్రాయం వ్యక్తమైంది.
నిజానికి పార్టీ కూడా జోగి రమేష్ నడిపించిన ఎపిసోడ్ మీద గుస్సా అయింది. అయితే.. బహిరంగంగా ఖండించలేని, ఆయనను మందలించలేని పరిస్థితి. సీఎం జగన్మోహన్ రెడ్డిని అసభ్యంగా తిట్టినందుకు, ఆయన తీవ్రంగా స్పందించారు గనుక.. పార్టీ ఆయన వెన్నంటి ఉన్నట్టుగా కనిపించాల్సి వచ్చింది. పార్టీ కార్యాలయంలో మాత్రం కొందరు పెద్దలు ప్రెస్ మీట్లు పెట్టి.. జోగికి మద్దతుగా మాట్లాడారు.
అయితే జిల్లా నాయకులు మాత్రం పూర్తిగా జోగి రమేష్ వ్యవహారాన్ని పట్టించుకోలేదు. జోగి రమేష్ కు మద్దతుగా ఒక్క మాట మాట్లాడినా కూడా.. ఆయన చేసింది ఘనకార్యం అని ఒక్కమాట అన్నా కూడా.. తమ అవకాశాలకు తామే గండి పెట్టుకున్నట్టు అవుతుందని వారంతా సంకోచించారు. అందరూ ఆయనకు మొహం చాటేశారు.
అంతే కాదు. బహిరంగంగా కాకపోయినప్పటికీ.. జోగి రమేష్ ఎపిసోడ్ మొత్తాన్ని పెద్ద డ్రామాగా వారే అభివర్ణిస్తున్నారని కూడా సమాచారం. పాపం.. మంత్రిపదవి కోసం జోగి పడిన పాట్లు ఫలితమిచ్చాయో లేదో తెలియాలంటే.. ఇంకా చాలా కాలం వేచి చూడాల్సిందే.
.

Discussion about this post