చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు కొండూరు సునీత, ఆమె భర్త నంద (నరసింహులు)ను సోమవారం కర్ణాటక పురపాలక శాఖ మంత్రి బైరాతి బసవరాజ్ సన్మానించారు.
పాలసముద్రం మండలం వెంగళరాజుకుప్పంలో ఈ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బసవరాజ్ మాట్లాడుతూ.. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులుగా కొండూరు సునీత నియమించబడటం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
సునీత ఎంతో సౌమ్యురాలు అని ఆయన కొనియాడారు. ధర్మకర్తల మండలి సభ్యురాలుగా దేవుని సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావించాలన్నారు.
సునీత, నరసింహులు దంపతులు భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని కోరుకున్నారు. ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలిలో క్షత్రియులకు అవకాశం కల్పించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించి.. ఆలయ అభివృద్ధికి కృషిచేసి స్వామి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల సముద్రం కేంద్రం క్షత్రియులు, కర్నాటక మంత్రి అనుచరులు, అభిమానులు పాల్గొన్నారు. వీరందరూ కొండూరు సునీత దంపతులను వేర్వేరుగా ఘన సన్మానం చేశారు.
.

Discussion about this post