KATHA SMRITHI :: Madhurantakam Rajaram :: Pichi Venkatravu
Review by KA Muni Suresh Pillai
పరిచయం. ఈ కథ రాజారాం గారికి అత్యంత ఇష్టమైన కథ కావడం విశేషం.
ఉన్నతమైన మానవీయ విలువలు, ఉపాధ్యాయ వృత్తిని ఒక బాధ్యతగా త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తి మహోన్నత వ్యక్తిత్వం… ఎంత గొప్పవారికైనా అనవసరపు మర్యాదలివ్వడం తెలియని లెక్కలేనితనం, ఎంత చిన్న వాడినైనా తగిన మర్యాదతో చూడడం, తన స్థాయికి తగదనే భేషజాలు లేకుండా.. ఎంత చిన్న పనినైనా స్వయంగా చేయడానికి పూనుకోవడం.. ఇలాంటి వ్యక్తిత్వ విశేషాలు ఈ కథానాయకుడు వెంకట్రావు సొంతం. సమాజం ఆయనకు ఇచ్చిన బిరుదు ‘పిచ్చి’ అనే ప్రిఫిక్సుగా అమరింది.
రచయిత మధురాంతకం రాజారాం గారు మాత్రం.. అదంతా ఆయన ఆత్మబలం అంటారు. ఆత్మబలం అంటే ఏమిటో ఈ కథ చదివితే మనకు తెలుస్తుంది. కథ లోతులను అర్థం చేసుకుంటే.. సదరు ఆత్మబలం తాలూకు అసలు బలం కూడా తెలుస్తుంది. మనమైనా సరే.. త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు.. అసాధ్యాల్ని సుసాధ్యం చేయగలమనే నమ్మకం కలుగుతుంది.
Discussion about this post