శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి మాజీ ఛైర్మన్, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అధికార మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ కుమార్ తండ్రి కోలా శ్రీనివాసులు నాయుడు (89) అనారోగ్యంతో బుధవారం ఉదయం 9.20గంటలకు తుదిశ్వాస విడిచారు.
శ్రీనివాసులు నాయుడుకు వయసు పై బడటంతో పాటు… ఇటీవల కొంత కాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతుండే వారు.
ఈ నేనథ్యంలో అనారోగ్యానికి గురై మృతి చెందారు. ఈయన అంత్యక్రియలు గురువారం ఉదయం 9గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా శ్రీనివాసులునాయుడు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియచేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
.