దేశంలో ప్రతిఒక్కరూ పాన్ కార్డుకు ఆధార్ లింకింగ్‌ను మార్చి 31 నాటికి పూర్తి చేయాలనే నిబంధనలో కొంత వెసులుబాటు వచ్చింది. ఇన్ కమ్ ట్యాక్స్ కు సంబంధించి.. కేంద్రప్రభుత్వం అనేక నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా తమ పాన్ కార్డును, ఆధార్ తో అనుసంధానం చేసుకోవాల్సిందేనని ఆదేశాలు వచ్చాయి. దీనికి మార్చి 31ని గడువుగా నిర్ణయించారు.
అయితే.. అసలే కొవిడ్ కారణంగా.. సహజ వాతావరణం, సహజ పరిస్థితులు తిరిగి నెలకొనకపోవడం… బుధవారం నాడు… ఆధార్ లింకింగ్ కు సంబంధించి.. వెబ్ సైట్ ఓపెన్ కాకపోవడం.. అనేకమంది యూజర్లు ప్రయత్నిస్తుండడంతో తరచుగా బ్లాక్ కావడం జరుగుతూ వచ్చింది.
ఈ కారణాలను అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. ఆధార్ లింకింగ్ కు గడువును కేంద్రప్రభుత్వం జూన్ 31 వరకు పొడిగించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
అయితే.. ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ తో సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి కూడా మార్చి 31 గడువు కాగా, ఆ పొడిగింపు విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు.
Central Government extends the last date for linking of Aadhaar number with PAN from 31st March, 2021 to 30th June, 2021, in view of the difficulties arising out of the COVID-19 pandemic.(1/2)@nsitharamanoffc@Anurag_Office@FinMinIndia
— Income Tax India (@IncomeTaxIndia) March 31, 2021
.

Discussion about this post