తొట్టంబేడు మండలం తహసీల్దారు పరమేశ్వర స్వామి సచివాలయాల ను తనిఖీ చేయడం, మధ్యాహ్న భోజనం రుచిగా ఉందా లేదా చూడడం,వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా అనేది ముఖ్యం కాదు అవి
రాజకీయ ప్రజా ప్రతినిధులు చేయవలసిన పనులు. మండలంలోని ఎక్కువ ప్రభుత్వ భూములు, కాలువ పోరంబోకులు, చెరువులు ఆక్రమించుకుని రాత్రికి రాత్రే నిర్మాణాలు జరుగుతున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం
అంతేకాకుండా జిల్లా నుంచి ప్రభుత్వ అధికారులు జరుగుతున్న అవినీతిపై విచారించడానికి వచ్చినా కూడా వారికి అందుబాటులో లేకుండా సహకరించకుండా పోవడం ఎంతవరకు సమంజసమని,
కనీసం శ్రీకాళహస్తి నుంచి కనపర్తి రోడ్డు మార్గంలో కొన్ని వందల ట్రాక్టర్లు ఇటుక బట్టీలకు మట్టిని తరలించి, తారు రోడ్డు గా ఉన్న రోడ్డు మట్టి రోడ్డు గా మారి, కనీసం 15 గ్రామ పంచాయతీల ప్రజలు మేనకూరు ఫ్యాక్టరీ నుంచి వెంకటగిరి నుంచి కనపర్తి రోడ్డు మార్గం ద్వారా
భారీ వాహనాలు రోడ్డుపైన రాకపోకలు కొనసాగిస్తూ ద్విచక్ర వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు దుమ్ము ధూళి పొగ మంచుతో శుభకార్యాలకు పోయేవారు తెల్లని దుస్తులతో బయలుదేరిన వారు VM పల్లి వద్దకు వెళ్లేసరికి మట్టి దుస్తులతో దర్శనమిచ్చే పరిస్థితి దాపురించిందని,
ఇప్పటికైనా స్పందించి రోడ్డును అటు రెవెన్యూ అధికారులు ఇటు ఆర్అండ్ బి అధికారులు స్పందించకుండా వ్యవహరించడం భావ్యం కాదని, ఫోటోలకు ఫోజులు ఇవ్వకుండా కబ్జాలను అరి కట్టకపోతే ప్రజా ఉద్యమం తప్పదని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మురళి నాయుడు డిమాండ్ చేశారు
.