• About Us
  • Contact Us
  • Our Team
Friday, July 31, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

లోపలిమాట : మతి గతి తప్పితే ప్రగతి అధోగతే!

admin by admin
June 29, 2021
0
లోపలిమాట : మతి గతి తప్పితే ప్రగతి అధోగతే!

కుటుంబంలో ఒకరికి పెళ్ళి చేయాలన్నా, విద్యార్థి పరీక్షకు సన్నద్ధం అవ్వాలన్నా, నూతన గృహం నిర్మించాలన్నా ముందుగా పక్కా ప్రణాళికను తయారుచేసుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారం క్రమపద్దతిలో చేసుకుంటూ వెళితే మనం తలపెట్టిన కార్యక్రమం విజయవంతం అవుతుంది. అలా కాకుండా ప్రణాళిక మాత్రమే వేసుకుని, దానిని అమలు పరచడంలో విఫలమైతే మనం తలపెట్టిన కార్యక్రమం మనకు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వదు.

మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనతోపాటే తిరిగిన వ్యక్తి ఉన్నతస్థాయికి చేరుకున్నప్పుడు మనం తరచుగా అనే మాట…

“రేయ్! వాడు చిన్నతనంలో మాతోపాటే తిరిగేవాడు. పెద్దగా తెలివైనోడు కూడా కాదురా. మామూలుగా ఉండేవాడు. ఎవరితోనూ సరిగా మాట్లాడేవాడు కాదు. అంత పెద్దవాడు అవుతాడని అసలు నేను కలలో కూడా ఊహించలేదురా. దేనికైనా అదృష్టం  ఉండాలిరా” అని మాట్లాడుకుంటూ ఉంటాం.

కానీ, ఆ వ్యక్తి ఆ స్థితికి రావడానికి అతను వేసుకున్న ప్రణాళిక, పాటించిన క్రమశిక్షణ, పడిన శ్రమ మన కంటికి కనిపించవు. అతను ఎంత కష్టపడితే ఆ స్థాయికి చేరుకున్నాడనే ఆలోచన మనలో చాలామందికి రాదు. ఆ దిశగా ఆలోచించకపోవడంవల్లే మనం విజయం సాధించలేకపోయాం అనే నిజాన్ని కూడా మన మనస్సు అంగీకరించదు.

ఎంత తెలివైనవారైనా, మంచి నైపుణ్యం కలిగినవారైనా, అపారమైన సామర్థం కలిగినవారైనా క్రమశిక్షణ లేకపోతే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోలేరనేదానికి నిదర్శనంగా నా జీవితంలో నేను సమీపంగా గమనించిన కొందరి వ్యక్తుల గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను.

deviprasad obbu columnistనా చిన్నతనంలో…

మేం నివాసం ఉండే పక్కవీధిలో ఒక సంగీతం మాస్టారు కాపురం ఉండేవాడు. కానీ, ఆయన మా వీధిలోనే ఒక రూం అద్దెకు తీసుకుని సంగీతాభిలాషులకు విద్య నేర్పేవాడు. నాకు సంగీతం పట్లున్న ఆసక్తి కారణంగా నేనూ ఫ్లూటు నేర్చుకోవడానికి ఆ మాస్టారి దగ్గర చేరాను. అతను సంగీత పరికరాలలో దేనానైనా అవలీలగా ప్లే చేసేవాడు. అతను సంగీత పరికాలను ప్లే చేస్తున్నప్పుడు మనస్సుకు చాలా హాయిగా, మధురంగా ఉండేది. అంతేకాదు అతని గాత్రం కూడా వినసొంపుగా ఉంటుంది. అతనికున్న పరిజ్ఞానానికి ఎంతో ఉన్నతస్థాయికి చేరుకుని ఉండాలి. కానీ, తనకున్న దురలవాట్లు, క్రమశిక్షణా రాహిత్యంవల్ల అధోగతి పాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ మాస్టారికి మద్యం అలవాటుతో పాటు స్త్రీ వ్యామోహం కూడా ఉండేది. రోజూ మద్యం సేవించేవాడు. ఆ మద్యం మత్తులోనే పాఠాలు బోధించేవాడు. ఆ సమయంలో మాస్టారి దగ్గర విద్య నేర్చుకునే అమ్మాయిలపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. మాయమాటలు చెప్పి కొందరి అమ్మాయిలను లోభరచుకునేవాడు. అనతికాలంలోనే అతని ప్రవర్తన అందరికీ తెలిసిపోవడంతో మా వీధిలో వాళ్ళు అతనికి దేహశుద్ధి చేసి మా వీధి నుంచి తరిమేశారు. విషయం తెలిసిన అతని భార్య అవమానంతో చెప్పపెట్టకుండా అతన్ని వదలి ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పటినుంచి తాగుడుకు మరింత బానిసై నలభైయేండ్లకే తనువు చాలించాడు.

అదేవిధంగా…

నా చిన్నతనంలో నాతోపాటే చదివే ధనంజయ అనే స్నేహితుడు ఉండేవాడు. వాళ్ళ అమ్మానాన్న అరటిపండ్లను బండిమీద అమ్మేవారు. వాళ్ళు మా వీధిలోనే నివాసం ఉండేవారు. వాడితోపాటు కొందరు స్నేహితులం కలిసి బడికి వెళ్ళేవాళ్ళం. వాడు కూడికలను, తీసివేతలను పలకమీద, పుస్తకంమీద రాయకుండానే చెప్పేసేవాడు. వాడి తెలివిని చూసి అయ్యోర్లు కూడా ఆశ్చర్య పోయేవారు. కానీ, వాడు బడికి మాత్రం సక్రమంగా వచ్చేవాడుకాదు. రోజూ మాతోపాటే బయలుదేరినా మధ్యలోనే ఆగిపోయేవాడు బడికి రాకుండా. ఒకరోజు మేం బడి నుంచి ఇంటికి వస్తుండగా ఒక గోడచాటున బీడీలు కాలుస్తూ కనిపించాడు. మేం షాకైనాం. ఆ విషయం బడిలో అయ్యోరితోపాటు వాళ్ళ ఇంట్లో కూడా చెప్పేశాం. అంతే ఇరుచోట్ల వాడికి బడితపూజ జరిగింది. అయినా వాడిలో మార్పురాలేదు. పైగా ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి సినిమాలకి వెళ్ళేవాడు. దాని పర్యవసానంగానే వాడిని ఏడవతరగతిలోనే బడి మాన్పించేశారు ఇంట్లో వాళ్ళు ఏదోక పనిచేసుకోమని. కానీ, వాడు తన ప్రవర్తనను ఏ మాత్రం మార్చుకోకుండా బలాదూరుగా తిరిగేవాడు. అలా వాడి చదువుకి ఫుల్ స్టాప్ పడింది.

చాలా  సంవత్సరాల తర్వాత ఓరోజు..

వాడు నాకు బజారులో తారసపడ్డాడు. అంటే నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత. పాత లుంగి పైకి కట్టుకుని ఉన్నాడు. వేసుకున్న చొక్కా కూడా బాగా మాసిపోయుంది. చింపిరి జుట్టు, పీక్కపోయిన ముఖంతో చాలా బలహీనంగా ఉన్నాడు. అతని ఎడమచేతిలో కమ్మితో చేసిన ‘టీ’ లు పెట్టుకునే స్టాండు ఉంది. అందులో తాగేసిన ఆరు టీ గాజు గ్లాసులు ఉన్నాయి. వాడికి నాతో మాట్లాడాలని ఉంది. కానీ సంశయిస్తున్నాడు. అర్థంచేసుకుని నేనే పలకరించాను. సంతోషపడ్డాడు. వాడి పరిస్థితి చూసి “బాగున్నావా?” అనే ప్రశ్న అడగాలనిపించలేదు. వాడే నన్ను అడిగాడు

“ఏంచేస్తున్నావు?” అని.

“గవర్నమెంటు టీచర్” అని చెప్పాను.

“నేనూ నీలాగే బడికొచ్చుంటే నాకు ఇప్పుడు షాపులకు టీ మోసే పనుండేదికాదేమో” అన్నాడు. దానికి సమాధానం ఏంచెప్పాలో తెలీక కాసేపు మౌనంగా నవ్వాను.

“యాభై ఉంటే ఇవ్వవా. మళ్ళీ ఇచ్చేస్తాను” అన్నాడు.

నాకు గుండెల్లో కలుక్కుమంది. నాతో పాటు చదివిన స్నేహితుడు అలా దీనంగా అడిగేసరికి. వెంటనే పర్సులోంచి వంద తీసి అతని చేతిలో పెట్టాను. వాడి ముఖంలో చిరునవ్వు కనిపించింది. కానీ, నాకు మాత్రం చాలా బాధ కలిగింది. స్నేహితుడిని అలా దీనస్థితిలో చూసినందుకు. నా కళ్ళలో బాధను వాడు పసిగట్టక ముందే నేను అక్కడ నుంచి వచ్చేశాను.

పై సంఘటనలను పరిశీలించిన తర్వాత మనకు అవగతమైన విషయం ఏంటంటే… ఎంతటి నైపుణ్యం కలిగినవాడైనా క్రమశిక్షణ లేకపోవడం, దురలవాట్లకు బానిసవ్వడం, తను చేసే పనిపట్ల ఆసక్తి, ఏకాగ్రత లేకపోవడం తదితర కారణాలచేత జీవితాలు దుర్భరంగా మారాతాయనేది సుస్పష్టం.

కానీ, ఒక మనిషి పైకి ఎదగకపోవడానికి అతనికి ఎదురైన పరిస్థితులు, తన చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావమే కారణమని కొందరు చెప్తుంటారు. ఈ వాదనను నేను అంగీకరించను.

ఎందుకంటే…

పైన నేను తెలిపిన సంఘటనలలో పరిస్థితులుగాని, పరిసరాల ప్రభావంగాని మనకు ఎక్కడా కనిపించలేదు. కేవలం వారి క్రమశిక్షణా రాహిత్యం, దురలవాట్లు, దుష్ప్రవర్తనలే వారిని అధఃపాతాళానికి నెట్టివేశాయనేది తేటతెల్లం.

కాబట్టి…

జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నా లేక అనుకున్న లక్ష్యం సాధించాలన్నా క్రమశిక్షణతో పాటు కష్టపడే తత్వాన్ని అలవరచుకుంటే ఎవరైనా పురోగతి సాధించగలరు.

…దేవీప్రసాద్ ఒబ్బు

9866251159.

Tags: deviprasad obbulopalimataobbu prasadదేవీప్రసాద్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply