శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి గంగా భవానీ సమేత పరమశివుడు దశకంఠుని పైనా… ఆయన దేవేరి జగదాంబ మయూర వాహనం పైనా పురవీధుల్లో విహరించారు.
సర్వాలంకార భూషితులై చతుర్మాడ వీధుల్లో ఊరేగుతున్న పార్వతీ పరమేశ్వరులను వీక్షించడానికి భక్తులకు రెండు కన్నులు చాలలేదు.
అంతకు మునుపు గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవారి ఉత్సవ మూర్తులను అలంకార మండపం వద్ద విశేషంగా అలంకరించి… ప్రత్యేక పూజలు చేశారు.
ఆ తరువాత ఉత్సవ మూర్తులను పురవిహారానికి తీసుకువచ్చారు. బంగారు దశకంఠునిపై శ్రీకాళహస్తీశ్వరుడు, బంగారు నెమలి వాహనంపై జ్ఞానప్రసూనాంబ అమ్మవారు వెడలుతుండగా… మూషిక వాహనంపై వినాయకుడు, చప్పరాలపై శ్రీవళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప వీరిని అనుసరించారు.
చతుర్మాడ వీధుల్లో ఊరేగుతున్న స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
.

Discussion about this post