పిచ్చి ముదిరి రోకలిని తలకు చుట్టమన్నాడట వెనుకటికి ఒక పెద్ద మనిషి. అలా పిచ్చి ముదిరి చాలా మంది చాలా చిత్రాలు చేస్తున్నారు. అవన్నీ సోషల్ మీడియాలొో వైరల్ అయిపోతున్నాయి. అయితే దీనికి కాస్త టైం పడుతుంది. అలాకాకుండా కాస్త పెద్దవాళ్లే మీడియా ముందు సదరు పిచ్చి గురించి ప్రత్యేకంగా ప్రదర్శించి చెబితే ఇక అది ఎంత పెద్ద వైరల్ అవుతుందో ఊహించండి.
రామాంజనేయులు అనే ఒక తెరాస పార్టీ కార్యకర్త పార్టీ పిచ్చి ముదిరి వెర్రిగా మారి పార్టీ అధినేత, ఆయన కుమారుడి చిత్రాలను తన శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. తాను తన గుండెలపై చిత్రించుకున్న ఈ పచ్చబొట్టు చిత్రాలను కేటీఆర్ కు చూపించగా ఆయన విస్మయానికి గురయ్యారు. ఇలాంటి సాహసాలను చేయవద్దని సదరు కార్యకర్తను మందలించారు. అంతేకాకుండా ట్విట్టర్ లో ఈ విషయం గురించి ప్రస్తావించారు. అయితే ఇలా ప్రచారం వచ్చిన తర్వాత మరో కార్యకర్త మరో సాహసం చేయకుండా ఉంటాడా…? ఇలాంటి పిచ్చి ప్రదర్శన చేసిన వారిని కేవలం మందలించడంతో సరిపెట్టకుండా వారికి తగిన బుద్ధి చెబితే మళ్లీ మరోమారు ఇంకెవరూ ఇలాంటి పిచ్చి పనులను చేయకుండా ఉంటారు.
అయినా అభిమానం అనేది పిచ్చిగా ముదిరి ఇలాంటి పనులకు పూనుకోవడం మనం చూస్తుంటాం. అయితే ఇలాంటి పచ్చబొట్టు పొడిపించుకోవడం వంటి పనులు చేసేవారు తమ కన్న తల్లిదండ్రులను, తనను ప్రేమించే వారిని గురించి కాస్త పట్టించుకుంటే మరింత బాగుంటుంది. కొంతమంది అభిమానం పేరుతో ప్రాణత్యాగాలకు సిద్ధపడుతుంటారు. ఇలాంటి ప్రాణత్యాగాలకు సిద్ధపడేముందు తమ తల్లిదండ్రులను గురించి కాస్త ఆలోచిస్తే మంచిది. వారికి కడుపుకోత లేకుండా ఉంటుంది.
.

Discussion about this post