తిరుపతిలోని కపిలతీర్థం ప్రాంగణంలో గల శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ మండలాభిషేకం శుక్రవారం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, యజమాని సంకల్పం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ట, మహాశాంతి, కుంభావాహన, కుంభారాధన, మహాశాంతి హోమంతోపాటు మూలవర్లకు అభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈవో కె.సుబ్బరాజు, కంకణభట్టార్ గోవిందాచార్యులు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post