మన ఇంట్లో వాళ్ళు ఓ పది రోజులు ఎక్కడికైనా వెళ్తే ఏదో తెలియని వెలితి వెంటాడుతుంది. మళ్లీ వాళ్ళు వచ్చేదాకా ఏ పనీ చేయబుద్ధి కాదు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ పరిస్థితి కూడా అదే. భారత మార్కెట్లను శాసించే విదేశీ మదుపర్లు క్రిస్మస్ పేరు చెప్పి సెలవులు తీసుకుని సొంత ప్రదేశాలకు వెళ్లిపోయారు.
మళ్లీ జనవరి ఫస్ట్ వీక్ అయితేనే కానీ వాళ్ళ సందడి కనిపించదు . అంతగా ముడిపడిపోయారు వాళ్ళు మన మార్కెట్లతో …ఈ మూడు నెలల్లో వాళ్ళు లక్ష కోట్ల రూపాయలకు పైబడిన షేర్లను మార్కెట్లో అమ్మేయడమే . ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ…. . అంటే సగటున రోజుకు 5000 -6000 కోట్ల రూపాయల వ్యాపారం చేసే వీళ్ళు… ఇప్పుడు రోజుకు 700 -800 కోట్ల వ్యాపారం చేస్తే ఎక్కువ. ఎప్పుడైతే విదేశీ మదుపర్ల ట్రేడింగ్ తగ్గ్గిపోయిందో మన మార్కెట్ బక్కచిక్కినట్లు అయిపొయింది. గత కొద్దిరోజులుగా మార్కెట్లో ఇదే పరిస్థితి.
ఈవేళటి ట్రేడింగ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. అస్సలు ట్రేడింగ్ చేయలేని పరిస్థితి. అటు సూచీలూ కదలవు, ఇటు షేర్లూ కదలవు… ఏది కొనాలో తెలియదు. ఏది అమ్మాలో తెలియదు. గంటలు గడుస్తున్నా ఎక్కడి షేర్లు అక్కడే ఉంటున్నాయి తప్ప అడుగు ముందుకు పడదు. రోజుకు ఐదారు రూపాయలు అటూ ఇటూ కదిలే icici bank లాంటి షేర్లు సైతం ఒక్క రూపాయి మారడానికి 3 గంటలకు పైగా టైం తీసుకున్నాయి. మొత్తం మీద ట్రేడింగ్ అంతా చాలా స్తబ్దుగా సాగిపోయింది. రాబోయే రెండు రోజుల్లోనూ ఇదే మాదిరి కదలాడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివల్ల ఆప్షన్స్ లో విలువలు పడిపోయి మామూలు ఇన్వెస్టర్లకు నష్టాలే మిగులుతాయి తప్ప ఉపయోగం ఉండదు.
ఇక పొద్దున్న నుంచీ sensex కేవలం 100 పాయింట్లు, nifty 20 పాయింట్ల లోపే కదలాడాయి. ఇంకో పావు గంటలో ట్రేడింగ్ ముగుస్తుంది అనగా అంటే.. 3 15 తర్వాత ఒక్కసారిగా మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి మొదలైంది . దీంతో షేర్ల ధరలు పడటం మొదలెట్టాయి.
bank nifty 3.20 నుంచి 3.25 మధ్యలో అంటే కేవలం 5 నిమిషాల వ్యవధిలో 200 పాయింట్లు పడిపోయింది.. అయితే ట్రేడింగ్ పూర్తయ్యాక జరిగే సర్దుబాట్ల తర్వాత సూచీలు మళ్లీ యధా స్థాయికి వచ్చేశాయి. చివరకు సెన్సెక్స్ 90.99 పాయింట్లు నష్టపోయి 57806.49 వద్ద స్థిరపడితే… nifty 19.65 పాయింట్లు కోల్పోయి 17213.60 వద్ద ముగిసింది . విదేశీ మదుపర్లు ఈరోజు 975 కోట్ల రూపాయల అమ్మకాలు జరపగా… దేశీయ సంస్థలు 1000 కోట్ల రూపాయలకు పైగా నికర కొనుగోళ్లు జరిపాయి. దీంతో సూచీలు పెద్ద మార్పు లేకుండా ముగిశాయన్న మాట. అన్ని రంగాల షేర్లూ నష్టాలు రుచి చూపిస్తే ఒక్క ఆటోమొబైల్, ఫార్మా రంగాలు మాత్రం లాభాల్లో నిలిచాయి. midcap, small cap షేర్లు లాభాలు పంచాయి.
బీఎస్ఈ లో బుధవారం 3474 షేర్లు ట్రేడ్ అవ్వగా.. 2053 షేర్లు పెరిగాయి. 1334 షేర్లు క్షీణించాయి. 87 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పూ లేదు మొత్తం 413 షేర్లు 52 వారాల గరిష్ట స్థాయిని చేరగా … 12 షేర్లు 52 వారాల కనిష్ట స్థాయిలో ముగిశాయి. 619 షేర్లు upper circuit ని టచ్ చేస్తే… 105 షేర్లు lower circuit ని తాకాయి . bse లో మొత్తం 4050 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లు సైతం స్తబ్దుగానే ట్రేడ్ అయ్యాయి.
ఫ్యూచర్స్ & ఆప్షన్స్ december సిరీస్ ku రేపు చివరి రోజు కావడం తో గురువారం nifty 17000-17300 స్థాయిలో కదలాడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి.
.. బెహరా శ్రీనివాసరావు
బిజినెస్ జర్నలిస్ట్

.