నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త ఫర్వాలేదు. షేర్లలో కదలికలు కనిపించాయి. మార్కెట్ లో ట్రేడింగ్ ప్రారంభమైనది లగాయతు సూచీలు తీవ్ర ఒడుదొడుకులతో కొనసాగాయి.
విదేశీ మదుపర్ల గైరుహాజరీ లో ట్రేడింగ్ తక్కువ స్థాయిలోనే జరిగినప్పటికీ డిసెంబర్ నెలకు సంబంధించి ఫ్యూచర్స్ & ఆప్షన్స్ కు గురువారం చివరి రోజు కావడంతో మదుపర్లు ఆచితూచి అడుగేశారు. ప్రధానంగా ఐటీ షేర్లు దూకుడు ప్రదర్శించాయి.
టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, hcl టెక్, వంటి ప్రధాన షేర్లే కాక, మిడ్, స్మాల్ క్యాప్ విభాగాల్లోని coforge, mindtree , kpit టెక్నాలజీస్ వంటి షేర్లు మంచి లాభాలు నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్ కేవలం 12 పాయింట్ల నష్టంతో 57794 వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి nifty సైతం నిన్నటితో పోలిస్తే ఒక్క పాయింట్ తక్కువగా 17204 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ లో గురువారం 3460 షేర్లు ట్రేడ్ అవ్వగా.. 1853 షేర్లు పెరిగాయి. 1508 షేర్లు క్షీణించాయి. 99 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పూ లేదు మొత్తం 418 షేర్లు 52 వారాల గరిష్ట స్థాయిని చేరగా … 15 షేర్లు 52 వారాల కనిష్ట స్థాయిలో ముగిశాయి.
647 షేర్లు upper circuit ని టచ్ చేస్తే… 142 షేర్లు lower circuit ని తాకాయి . bse లో మొత్తం 3902 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగింది.
జనవరి నెలకు సంబంధించి ఫ్యూచర్స్ & ఆప్షన్స్ కొత్త కాంట్రాక్టు లు రేపటినుంచి ప్రారంభమవుతాయి
.. బెహరా శ్రీనివాసరావు
బిజినెస్ జర్నలిస్ట్

.