ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అక్టోబరు 14 శుక్రవారం నాడు గవర్నమెంట్ ఐటిఐ కళాశాల , వెంకటగిరిలో పదవ తరగతి పాస్/ఫెయిల్ నుంచి పీజి వరకు ఉత్తీర్ణత అయిన యువతి యువకులకు మెగా జాబ్ మేళా నిర్వహి స్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్. శ్యామ్ మోహన్ తెలియజేశారు.
ఈ జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన14 బహుళ జాతీయ కంపెనీలలో దాదాపు 1500 ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.
ఈ జాబ్ మేళాలో అర్హత సాధించిన యువతీ యువకులకు నెలకు కనీస జీతం 10000/- నుంచి 25000/- వివిధ రకాల కంపెనీలలో ఉద్యోగ నియామకాలు కల్పించబడును.
ఈ జాబ్ మేళాకు హాజరయ్యే యువతీ యువకులు ఆధార్ కార్డ్ జిరాక్స్, 5 బయోడేటా ఫార్మ్స్ మరియు జిరాక్స్ సర్టిఫికేట్స్ తో తప్పని సరిగా తీసుకొని రావాలి మరిన్ని వివరాల కోసం క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకు http://shorturl.at/twxY4 లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.
ఆసక్తి కలిగిన యువతీ యువకులు ఈ జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఎన్ శ్యామ్మోహన్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. మరిన్ని వివరాల కోసం 9032697478, 7989509540 నెంబర్లను సంప్రదించగలరు.
Discussion about this post