ప్రజా సేవకుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు, యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కరోనా బారిన పడడం వారు త్వరగా కోలుకుని ప్రజలమధ్యక రావాలని ఆకాంక్షిస్తూ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలోని శివాలయం గుడి మృత్యుంజయ హోమాన్నినిర్వహించారు.
అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చంద్రబాబు, లోకేష్ కరోనా మహమ్మారి బారినపడటం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రజలే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ వారిద్దరి ఆరోగ్యం కుదుట పడాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు.
ప్రజా సేవ చేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అధికారమైనా.. ప్రతిపక్షమైన ప్రజలకు అండగా ఉన్న నేత చంద్రబాబు అన్నారు.
వారికి దేవ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఆర్ పి శ్రీనివాసులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మధు బాబు, పార్లమెంటు తెలుగు యువత నాయకులు కృష్ణ యాదవ్, కుమార్, శ్రీరామ్ బాబి, జయ బాబు, వంశీ, సుభాష్, జ్ఞాన శేఖర్, వెంకటేష్, భూపతి, వెంకట్ రెడ్డి, మురళి నాయుడు, అశోక్ తదితరులు పాల్గొన్నారు .
.

Discussion about this post