• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, July 29, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

నా గురువు -2: అంతిమ ప్రయోజనం

admin by admin
November 18, 2021
0
నా గురువు -1: అనిలాచల ఋషి

గురు-శిష్య భేదం తొలగిపోవడమే సద్గురు సత్సంగం యొక్క అంతిమ ప్రయోజనం. దేవ-జీవ భేదం తొలగిపోవడమే దైవోపాసన యొక్క అంతిమ ప్రయోజనం.

అనేకత్వాన్ని విడిచి ఏకత్వం వైపుకు చేరడమే ఈ ఆధ్యాత్మికతకు  అంతిమ ప్రయోజనం. అభేదభావం కేవలం సిద్ధి కలిగినప్పుడు మాత్రమే కాదు, సాధనావస్థలో కూడా అభేదభావం కలిగి ఉండడమే సద్గురు సంప్రదాయం.

భేదభావనాత్ సో2హ మిత్యసౌ
భావనా2భిదా పావనీ మతా

‘ఈశ్వరుడు వేఱు, నేను వేఱు అనే భావముతో కూడిన ఈశ్వరభావన కంటే అతడే నేను అన్న అభిన్నభావనయే పావనమైనది’  అన్న రమణుల మాటే పరమ ప్రమాణం.

  * * *  

“మీరు భగవంతుణ్ణి లేదా ఆత్మను పొందిన అనుభవం మీకు లేకపోవచ్చునుగాక.. కానీ ‘నేను పొందాను’ అనే భావనతోనే నా సన్నిధికి  రండి..”అంటుంటారు గురువుగారు. ఆత్మానుభవం పొందావా? అని నిన్నెవరైనా అడిగితే “పొందాను” అని ఘంటాపధంగా చెప్పు అంటారు గురువుగారు.

యెందుకంటే, నీ స్వరూపమే అది.. నేను పొందలేదు.. అని నీవనుకుంటే, నీవు కూర్చున్న చాపకు కూడా అవమానమే.. అన్నారు గురువుగారు.

also read : జగన్.. ప్రభువు ప్రార్థన మిస్ కాకూడదనేనా? లేదా..

‘జగనన్నా ఆగలేం..’ వైఎస్సార్సీపీ ఆశావహుల గగ్గోలు

కాకపోతే అది జ్ఞప్తికి రావడానికి కొందరిలో కాస్త ఆలస్యం కావొచ్చు అంతే. I AM THAT I AM (నేను అదే నేను) అనేది పక్కా. అదే నేనన్న జ్ఞప్తికి తెచ్చేవే ఈ అధ్యయనము, సద్గురుప్రబోధము, ధ్యానము.. మొదలైనవి..

  * * *  

‘జ్ఞానప్రసూనాలు’ పుస్తకం చదివి దూరప్రాంతాల నుండి గురుదర్శనానికి వస్తుంటారు. రమణాశ్రమం వెళ్లివస్తూనో శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్లి వస్తూనో పనిలో పనిగా సద్గురు దర్శనం చేసుకుందామని వచ్చేవారు యెక్కువ. అందులో ఏ కొద్దిమందో గురుపాదాలకు అంకితమై, ఇక మాకు ఏ క్షేత్రమూ, ఏ ఆశ్రమమూ అవసరం లేదని స్థిమితపడినవారున్నారు.

తెలుసుకోవాలని ప్రశ్నించే జిజ్ఞాసువులు కొందరు. మౌనంగా కూర్చొని తిరిగి వెళ్లేవారు కొందరు.

గురువుగారు దీర్ఘోపన్యాసాలు ఇవ్వరు. ఒకటి రెండు మాటల్లోనే వారు చెప్పదలచుకున్న విషయమంతా నిండిపోయి ఉంటుంది.

  * * *  

సమస్య తెగకో.. సమస్య తెగడంఇష్టం లేకనో.. లేక ప్రశ్నించడం స్వభావమై ఉండడం వల్లనో

కొందరు ప్రశ్నిస్తూనే ఉంటారు.. సమాధానం పొందటం వారికి  ఇష్టం లేదు.. ప్రశ్నించడం ఒక వ్యసనం! ఇదొక రకమైన దురద అంటారు గురువుగారు.

గురువు ద్వారా సమాధానం కాదు, గురువే సమాధానం.

వారి ప్రశ్నలు ఒకస్థాయికి చేరుకున్నాక.. ‘నిద్రలో అడగండి చెబుతాను..’ అని గురువుగారనడం కద్దు.

అంతటితో ప్రశ్నల పరంపరకు ఫుల్ స్టాప్ పడుతుంది.

ప్రశ్న – వ్యక్తిగతమైనది.

సమాధానం – సర్వగతమైనది.

  * * *  

సద్గురు అనుగ్రహప్రసారానికి,  సద్గురు నిజబోధాప్రవాహానికి మన ప్రశ్నే(మాటే)ఆటంకం. మాట ఆగిపోతే మనసు మూగబోతుంది. మనసు మూగబోతే ఆత్మ తేటపడుతుంది. కొందరు గురుసన్నిధే గొప్ప సమాధానం అన్నట్టు గురుసన్నిధిలో మౌనంగా కూర్చొని గురుతత్త్వాన్ని సంపూర్ణం, నిశ్శబ్దంగా ఆస్వాదిస్తుంటారు. కొందరు ‘మాకు ఈ వేదాంతంతో పనిలేదు.. మేం గురువుగారికి శుభ్రంగా వండిపెడతాం అని  వంటపనిలో నిమగ్నమయి ఉంటారు.

కొందరు పుస్తక ప్రచురణలు, ముఖపుస్తక (facebook) ప్రచారాలు చేసేవారు. వారంలో రెండుసార్లు గురువు తలనే శివలింగంగా భావించి, గుండు చేసే  క్షురకులు కొందరు. పనిమనుషులు అని పేరేగాని స్వంతమనుషుల్లా సేవ చేసే పనివారు కొందరు.

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

వారి చేతుల మీదుగా బిరియానీలు తినే కాలభైరవులు. బోండాలు తినే మార్జాలాలు. ధాన్యం తినే పిచ్చుకలు. అన్నీ వారి దర్శనం నిమిత్తం వారి సన్నిధిలో తిరుగాడేవేగాని, తిండికై కాదు.

క్రీడనిమిత్తంగా ఉత్తరకైలాసం నుండి దక్షిణకైలాసానికి (శ్రీకాళహస్తికి)  దిగివచ్చిన పార్వతీదేవి – గురువు. వారి ముఖాముఖిన ఉన్నవారంతా గణపతి మొదలైన శివగణాలు.

  * * *  

రాబోవు తరాలవారు- గురువుతో ముఖాముఖిన గడిపినవారిని సైతం తాకి, నమస్కరించుకునే రోజులు వస్తాయి. వారు నడయాడిన భూమిపై ఉన్న ధూళిని తీసుకుని నెత్తిన జల్లుకునే రోజులు వస్తాయి. వారి చిత్రపటాలు ప్రతి ఇంట్లో వెలిసే రోజులు వస్తాయి. వారి దివ్యసూక్తులు ప్రతి నోట్లో పలికే రోజులు వస్తాయి. అందుకే నేనిచ్చే సందేశం ఏమంటే- సద్గురువును ముఖాముఖి దర్శించండి. తరించండి.

– జ్ఞానశిశువు
9533667918

Tags: babu srikalahastignana prasunambagnana sisuvuguru subramanyamlocalNaa guruvuspiritualspiritual guruఅనిలాచల ఋషిగురువు సుబ్రమణ్యంనా గురువు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply