రాష్ట్రమంతా వైసీపీ ఎంతటి ఘన విజయాన్ని అయినా సాధించి ఉండొచ్చు గాక.. కానీ ఎమ్మెల్యేగా రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో ఒక్క ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికలో విజయం కోసం చెమటోడ్చవలసి వచ్చింది.

నగరి రూరల్ మండలం నంబాకం ఎంపీటీసీ సెటిల్మెంట్ లో ఓట్ల లేక్కింపు పూర్తయిన వేళకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గుణ శేఖర్ రెడ్డి కేవలం 63 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చాలా ప్రాంతాల్లో వైసీపీకి దక్కిన విజయాలతో పోలిస్తే ఈ మెజారిటీ చాలా స్వల్పం.
నంబాకం ఎన్నికలో పార్టీలకు లభించిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
వైసిపి 875 ఓట్లు
టిడిపి 812 ఓట్లు
నోటా 18 కోట్లు
చెల్లని పోట్లు 39
వైసిపి అభ్యర్థి గుణ శేఖర్ రెడ్డి 63 కోట్ల మెజారిటీతో గెలిచారు. చెల్లని ఓట్లు, నోటా ఓట్లు కలుపుకున్నా.. మిగిలిన వాటిలో ఏ కొంత అటు ఇటు అయినా సరే.. ఎమ్మెల్యే రోజాకు ఈ పరాజయం చాలా పరాభవంగా ఉండేది.
.