పుత్తూరు మండలం, ముద్దు క్రిష్ణపురంలో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీస్ దగ్గర సిడిపిఓ కసిరెడ్డి పద్మజ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం “టాటా ట్రస్ట్”, “శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆప్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్” వారు సంయుక్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు క్యాన్సర్‌పై ఉచిత శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వివిధ రకాలైన క్యాన్సర్ల పైన, నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పై (SVICCAR) స్వీకార్ వైద్య నిపుణులు అవగాహన కల్పించడంతో పాటు, అంగన్వాడి పరిధిలోని ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని కోరారు.
క్యాన్సర్లు రాకుండా ఏ యే జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. క్యాన్సర్లను ప్రారంభదశలో గుర్తిస్తే నయం చేయవచ్చని తెలియజేశారు. 90 మందికి ఉచితంగా బి.పి., షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్తో బాధపడుతున్న రోగులకు “టాటా ట్రస్ట్” తిరుపతిలోని అలిపిరి జూ పార్క్ దగ్గర ఉన్న స్వీకార్ ఆస్పత్రిలో తక్కువ ఫీజుతో ప్రముఖ వైద్యులు ద్వారా వైద్య సేవలు అందజేస్తున్నారని తెలియజేశారు.ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని పరిసర ప్రాంత ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్, ప్రోగ్రాం కో- ఆర్డినేటర్ వి.రెడ్డికుమారి, స్టాఫ్ నర్స్లు పార్వతి, జి.వినీత, అర్చన, మామోగ్రామ్ టెక్నీషియన్ చైతన్య మరియు సూపర్వైజర్లు బి. గీతాంజలి, సి.బేబీ పాల్గొన్నారు.
.