నగరి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చెప్పులను జీఎస్టీ పరిధిలోకి తేవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియ పరచడం జరిగింది,
ఈరోజు సామాన్యులు మొదలుకొని చెప్పులు వాడుతున్నారు అలాంటి చెప్పుల పైన 12 శాతం జీఎస్టీ ని తీసుకొని రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ము, ఈరోజు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉన్నారు, పోషణ భారంగా మారుతున్నది,
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను ఒకే విధానం దేశవ్యాప్తంగా GST తీసుకొని రావడం జరిగింది. ఈరోజు వస్త్ర పరిశ్రమలపైనా, జిఎస్టి పెంచడంతోపాటు, ఈ రోజు చెప్పులు పైన కూడా జీఎస్టీ పెంచడం దారుణం ఇది సామాన్యులను మోసం చేయడమే అవుతుంది, మరి ఈరోజు పెట్రోల్ డీజిల్ లో మాత్రం ఎందుకు జీఎస్టీ పరిధిలోకి తీసుకు రాలేదు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు,
ఈ రోజు రాష్ట్రంలో బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు గారు విజయవాడలో మాట్లాడుతూ కమ్యూనిస్టులను కుక్కలతో పోల్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మూర్ఖంగా మాట్లాడని వ్యతిరేకిస్తున్నాం. కమ్యూనిస్టులు నిజంగానే భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు, కార్మిక వర్గానికి, ప్రభుత్వ రంగాలను కాపాడుకోవడంలో ఈరోజు కాపలా ఉన్నారు,
సంస్థలకు బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఏజెంట్ లాగా పని చేస్తున్నారుఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చెప్పుల వ్యాపారస్తుల తో కలసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలం ఏఐటీయూసీ పట్టణ నాయకులు భాష రాజేంద్ర శేఖర్ కుప్పుస్వామి, సతీష్ వ్యాపారస్తులు సిరా ఉద్దీన్, అలీ, శీనుబాయ్, సికింద్రబాయ్, వ్యాపారస్తులు పాల్గొన్నారు
.

Discussion about this post