శ్రీకాకుళం జిల్లా రాజాంలో నిర్వహించిన 40వ జాతీయ సబ్‌జూనియర్ బాల్‌బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా బుధవారం ఆంధ్ర, తమిళనాడు జట్లమధ్య తుదిపోరు హోరాహోరీ పోటీ జరిగింది.
ఈ పోటీలో ఆంధ్రజట్టు విజయం సాధించి ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకుంది.
17 రాష్ట్రాలు పాల్గొన్న ఈ పోటీల్లో ఆంధ్రజట్టు విజయం సాధించడంపై స్థానిక బాల్‌బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్‌కే నిజాం, కార్యదర్శి మోహన్, కోచ్ గోపి హర్షం వ్యక్తం చేశారు.
జాతీయ పోటీలకు రాష్ట్ర జట్టులో ప్రతిభ చూపి బంగారు పథకం అందుకున్న నగరి క్రీడాకారుడు తేజేష్‌కు అభినందనలు తెలియజేశారు.
.