నగరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీ కి చెందిన హైమ ఏపీఎస్పీడీసీఎల్ లో పుత్తూరు విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగినిగా గత పది సంవత్సరాలుగా పనిచేసేది. తను ఉద్యోగం చేస్తూ తన ఇద్దరు పిల్లలను చదివిస్తూ మరియు కుటుంబాన్ని పోషిస్తూండేది. సెకండ్ వేవ్ లో కరోనా బారినపడి మృతి చెందింది.
కుటుంబం పెద్ద తల్లిని పోగొట్టుకుని ఆ కుటుంబం పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్ కె రోజా చాలా కలత చెందారు వారి కుటుంబానికి నేను అండగా ఉంటానని ఇచ్చిన మాట కి వారికి మనోధైర్యం అందించారు.
ఆ కుటుంబానికి భరోసాగా వారి కూతురు ఏ ఎం మౌనిక రాజు కు తన తల్లి ఉద్యోగం చేసిన విభాగంలోనే ఉద్యోగం వేయించారు.
ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండిని ప్రత్యక్షంగా కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేసేలా ఉద్యోగం కల్పించడం జరిగింది ,
ఈ సందర్భంగా దివంగత హైమ రాజు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఆర్ కె రోజా కు కృతజ్ఞతలు తెలిపారు.
.