నగరి ఎమ్మెల్యే రోజా గారు పుత్తూరు మండలం కె.బి.ఆర్ పురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆదివారం జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరంను ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడం కోసం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అదికారులు, స్థానిక నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రోజా డాక్టర్ అవతారం
నగరి ఎమ్మెల్య రోజా డాక్టర్ గా ఆదివారం అవతారం ఎత్తారు. బీపీ చెక్ చేశారు. మెడలో స్టెతస్కోప్ పెట్టుకుని.. రోగుల గుండె వేగాన్ని గమనించారు.
పుత్తూరు మండలం కె.బి.ఆర్ పురం గ్రామంలో ఆదివారం జరిగిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే, అక్కడికి హాజరైన ఒక వ్యక్తికి బీపీ పరిశీలించారు. ఒక డాక్టర్ లాగా పలకరించి ఆరోగ్యం విషయమై ప్రశ్నించడం ప్రజలను ఆకట్టుకుంది.
.