నగిరి లోని శ్రీ కరియమాణిక్య స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలు శుక్రవారం నిర్వహించారు. ఈ పవిత్ర ఉత్సవాల్లో టీటీడీ అధికారులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
కరియమాణిక్య స్వామి ఆలయం స్థానికంగా నగరిలో చాలా ప్రసిద్ధి గాంచిన ఆలయాల్లో ఒకటి. స్థానికులు, ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా పెద్దసంఖ్యలో వచ్చి స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు. పవిత్రోత్సవాల్లో కూడా పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

.