షాదీమహల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రోజా పర్యవేక్షించారు. పుత్తూరు పట్టణం నడిబొడ్డున ముస్లిం సోదరుల చిరకాల వాంఛ అయిన షాది మహాల్ ను అత్యాధునిక వసతులతో నిర్మాణం అవుతోంది.
రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ వారి నుంచి ఒక కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే మంజూరు చేయించారు.
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పర్యవేక్షణ లో నిర్మాణం శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈరోజు ఈ నిర్మాణ పనులను పర్యవేక్షించి అధికారులతో నిర్మాణ స్తిగతులను గురించి అడిగి తెలుసుకున్నారు.
ముస్లిం మత పెద్దలు అందరూ కలిసి ఈ నిర్మాణానికి ఆదినుంచి మనస్ఫూర్తిగా సహకరించి నిధులు తేవడానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఆర్కే రోజా గారికి ధన్యవాదాలు తెలిపారు.
.

Discussion about this post