తెలుగుదేశం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల చర్చా-వేదిక గౌరవసభ నేడు బీరకుప్పం, తెరని, మూలనత్తం, గుండ్రజుకుప్పం హరిజనవాడ పంచాయతీల నందు జరిగింది.
మండల నాయకులు,గ్రామ నాయకులు కార్యకర్తలు ఉత్సహంగా అధిక సంఖ్యలో పాల్గొని వారి సమస్యలను చర్చించడం జరిగింది.
గ్రామాలలోని మహిళలు మాట్లాడుతూ.. ఓటియస్ డబ్బులు కట్టడానికి పది రూపాయల వడ్డీకి తెచ్చి పదివేల రూపాయలు కట్టామని బీరకుప్పం మహిళలు వాపోయారు,
గుండ్రజుకుప్పం దళితవాడకు చెందిన భాగ్యమ్మ మాట్లాడుతూ ఒక బలుపు ఉన్న మా ఇంటికి వేల రూపాయలు కరెంట్ బిల్లు వస్తే మేము ఎలా కట్టేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెరని పంచాయతీ నందు తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాలో వైపై,జిరాక్స్,యస్టిడి కాల్స్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్టు తెలుగు యువత మండల అధ్యక్షుడు గుణశేఖర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి ఆర్.మీరా, టియన్టియుసి రాష్ట్ర కార్యదర్శి కె.బాలాజీ నగరి రూరల్ పార్టీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు, మాజీ అధ్యక్షులు సురేష్ నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి పరందమ నాయుడు, నారాయణస్వామి నాయుడు, గోవిందస్వామి, జయపాల్, ప్రతాప్, మండల మహిళ అధ్యక్షురాలు లక్ష్మీ, గోపి, నాగరాజు, మణి, భూపతి, శ్రీను, మురుగేషన్, రవి, నారాయణ, కమలాకర్, రాజా మరియు మహిళలు, యువత పాల్గొన్నారు.
.