భారతదేశం స్మార్ట్ టెక్నీలజీని అందిపుచ్చుకోవడంతో ముందుంటోంది. తాజాగా డ్రైవర్ రహిత మెట్రో రైలును ప్రారంభించింది. దేశంలో మొట్టమొదటిసారిగా డ్రైవర్ రహిత మెటరో రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ భారతదేశం స్మార్ట్ సిస్టమ్స్ వైపు ఎంత వేగంగా పయనిస్తోందో తెలుపుతుందని అన్నారు.

భారతదేశంలో గతంలో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రయత్నంతో తొలి మెట్రోరైలు ప్రారంభించబడిందని, 2014లో బిజెపి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేవలం ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో సేవలు ఉండేవని, నేడు 18 నగరాల్లో మెట్రో సేవలు ప్రజలు అందుబాటులోకి వచ్చాయని ఆయన అన్నారు.
2025 నాటికి కేంద్ర ప్రభుత్వం మెట్రో సేవలను 25 పైగా నగరాలకు విస్తరించి, ప్రజలకు తన సేవలను అందుబాటులోకి తేనుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మెట్రో సేవల విస్తరణకు మేక్ ఇన్ ఇండియా చాలా ముఖ్యమని మోడీ తెలిపారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా భారతీయులలో ఎక్కువమంది ప్రజలకు ఉపాధి లభిస్తుందని ఈ సందర్భంగా మోడీ తెలిపారు. పశ్చిమ జనక్ పురి-బొటానికల్ గార్డెన్ మధ్య 37 కిలోమీటర్ల పొడవున్న మెజంటా లైన్ లో ఈ డ్రైవర్ రహిత రైలును ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ రైలు నేటినుండే ప్రజలకు అందుబాటులోకి రానుంది.
.