చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూ ఉండడంతో ఈ నెల 21 చిత్తూరు నగరం ప్రెస్ క్లబ్ మిద్దె మీద జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సదస్సును వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి. కృష్ణప్ప, చిన్నం పెంచలయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు వారు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులో అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని.. దీనిపై గ్రామీణ ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే దిశగా జరుప తలపెట్టిన జిల్లా సదస్సును ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జల్లి విల్సన్, ఆవుల శేఖర్ సూచనల మేరకు వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు.
తదుపరి సదస్సు తేదీలను కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.
ఈ విషయం గుర్తించి జిల్లాలో ఉన్న వ్యవసాయ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు సహృదయంతో సహకరిస్తారని మనవి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
.