• About Us
  • Contact Us
  • Our Team
Monday, July 27, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ఆడబిడ్డలను కాపాడండి: చక్రాల ఉష

admin by admin
March 25, 2022
0
ఆడబిడ్డలను కాపాడండి: చక్రాల ఉష

ఆడబిడ్డలను కాపాడండని తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు చక్రాల ఉష విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ‘మీతో మీ ఎస్పీ’ స్పందన కార్యక్రమం నిర్వహించారు. స్పందనకు విచ్చేసిన తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడుకు తెలుగు మహిళల ఆధ్వర్యంలో చక్రాల ఉష వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చక్రాల ఉష మాట్లాడుతూ… ‘‘ఆడపిల్లల మీద మహిళల మీద దాడులు, లైంగికవేధింపులు, అకృత్యాలు, అత్యాచారాలు, హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆఖరికి పసిబిడ్డల జీవితాలు కూడా కామాoధులు చిదిమేస్తున్నారు. మీరేమో దిశా యాప్ అంటున్నారు. దిశా పోలీస్ స్టేషన్లు అంటున్నారు. దిశా చట్టం 21రోజుల్లో న్యాయం అంటున్నారే ఇప్పటి వరకూ ఒక్కరి కన్నా న్యాయం జరిగిందా? ఆడబిడ్డలను కన్న తల్లితండ్రులు ఆ పిల్లలని బయటికి పంపాలంటే భయపడుతూ ఉన్నారు. ఇంక నన్నా భద్రత భరోసా కల్పించండి’’ అని విన్నవించారు. ఇంకా ఏమన్నారంటే…‘‘పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో స్పందన కార్యక్రమం కి మీరు శ్రీకారం చుడుతుండటం హర్షించ దగ్గ విషయం. కార్యకమాన్ని తెలుగుదేశం పార్టీ తరపున మేము స్వాగతిస్తున్నాం. అయితే మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నియోజక వర్గాల పరిధిలో ఇటీవల కాలంలో మహిళపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నప్పటికీ… బాధితులకు తగు న్యాయం చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. చట్ట పరిధిలో బాధితులకు న్యాయం జరగడం లేదు. శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో పని చేసే ఓ కానిస్టేబుల్… ఇదే పట్టణంలో దక్షిణ కైలాసనగర్ లో నివాసం ఉంటూ వాలంటీరుగా పని చేసే ఉమామహేశ్వరి అనే యువతిని ప్రేమ పేరుతో వంచించాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి కోరినందుకు పంచాయతీ పేరుతో పిలిపించి ఆమె తండ్రిని చితకబాదాడు. యువతినీ కొట్టాడు. మీకు దిక్కున్న చోట చెప్పకోండి అంటూ బెదిరించాడు. ఈ అవమానం భరించలేక ఉమామహేశ్వరి నాలుగు నెలల కిందట ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ప్రాణాలు పోయినా ఆ యువతి కుటుంబానికి ఇంతవరకు న్యాయం జరగలేదు.

శ్రీకాళహస్తి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో మూడు నెలల కిందట రెండవ తరగతి బాలికపై అదే ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. రాజకీయ ఒత్తిళ్లతో ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై పత్రికల్లో రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం జరగలేదు.

శ్రీకాళహస్తి పట్టణం నడిబొడ్డున ఓ ప్రాంతానికి చెందిన యువకుడు బాబా ముసుగులో యువతులను వంచించాడు. ఇప్పటికీ అతడు అదే తరహాలో వ్యవహరిస్తున్నాడు. బాబా మోసాలపై ఏడాది కిందట ఓ కుటుంబం వారు శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ఇక్కడ పని చేస్తున్న ఓ పోలీసు అధికారి బాధితుల పక్షాన నిలబడకుండా… బాబా వైపు నిలబడ్డారు. ఇది కూడా రాజకీయ కారణాలో ఇలా చేశారు. పోలీసులు నిందితుని వైపు నిలబడటంతో బాధితులు చేసేది లేక మిన్నకుండి పోయారు.

తొట్టంబేడు మండలం కాసరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక వైద్యుడు వారం రోజుల కిందట అక్కడే సూపర్ వైజరుగా పని చేసే ఓ మహిళా ఉద్యోగిని రాయలేని విధంగా దూషించడంతో పాటు… వేధింపులకు గురి చేశాడు. బాధితురాలు యూనియన్ నేతల సహాయంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే అతనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

రేణిగుంట మండలం ఇందిరానగర్ పరిధిలో ఆరేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన మునిరాజా అనే వ్యక్తి వారం రోజుల కిందట లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో ఇతరులు వచ్చి రక్షించారు. నిందితునికి అధికార పార్టీ అండ ఉంది. ఈ అవమానం భరించలేక బాలిక కుటుంబం బంధువుల ఇళ్లకు వెళ్లి పోయింది.
నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో నాలుగు రోజుల కిందట జ్యోతి అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని అదే పట్టణానికి చెందిన చెంచుకృష్ణ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించి… ఆ బాలిక నిరాకరించడంతో గొంతు కోశాడు. ప్రస్తుతం ఆ బాలిక తిరుపతి రుయా ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఈమధ్య గూడూరు లో మరో అమ్మాయి ని పట్టపగలే కొంతుకోసి హత్య చేశారు.

ఇవి ఇటీవల కాలంలో జరిగిన కొన్ని ఉదాహరణలు మాత్రమే మీదృష్టికి తెస్తున్నాను. ఇలాంటి ఘటనలు నిత్యం జరగుతూనే ఉన్నాయి. మహిళపై అత్యాచారాలు, వేధింపులు జరగకుండా పోలీసులు చట్టబద్దంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. దిశ చట్టం కూడా కఠినంగా అమలు చేయాలి. పైన నేను పేర్కొన్న అన్ని ఘటనలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’’. ఈ ప్రభుత్వం లో షీ టీం కి వాహనాలు కూడా లేకపోవడం విడ్డురంగా ఉందన్నారు. ప్రభుత్వ కాలేజీ లో ఊరికి దూరంలో ఉండడం ఆడపిల్లల భద్రతకు ఆటకంగా ఉండబట్టి షీ టీం వారికి వాహనాలు ఇప్పించాలని ఉష కోరారు. ఈ కార్యక్రమంలో భాధిత కుటుంబాలు, పట్టణ మహిళ అధ్యక్షురాలు సుమతి, దుర్గా, సుజాత, కుమారీ, సునీమా, కావ్య, నాగిని, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

Tags: localsrikalahasti news
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply