శ్రీకాళహస్తి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులును ఘనంగా సన్మానం చేశారు.
రోటరీ క్లబ్ అధ్యక్షురాలు కండ్రిగ ఉమ, కార్యదర్శి శైలజ, సభ్యులు కలసి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వారు మాట్లాడుతూ… ముక్కంటి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. భక్తులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.
ఈ సందర్భంగా అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ… రోటరీ సంస్థలో సభ్యులుగా చేరుతానని తెలిపారు. ఆలయ అభివృద్ధికి పెద్దలు ఇచ్చే సూచనలు స్వీకరిస్తానని చెప్పారు.
భక్తుల సేవే శివయ్య సేవాగా భావిస్తూ శక్తివంచన లేకుండా ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు చంద్రప్ప, డాక్టర్ లక్ష్మినారాయణ, వేణు గోపాల్, డాక్టర్ వెంకట్ రామన్, భార్గవ్ మూర్తి, కొండు గారి కృష్ణ కుమార్, రమేష్ బాబు, ప్రమీల, శ్యాం ప్రసాద్, వెంకటముని, నారాయణ, మునిచంద్ర, గణేష్, జనిత, హబీబ్, బాలాజీ, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
.