కేవలం రాజకీయ నాయకులు మాత్రమే చేసే విమర్శల కంటె.. ఒక రంగంలో నిపుణులైన వ్యక్తులు చేసే విమర్శలకు విలువ ఎక్కువ. అలా నిర్దిష్ట రంగాల్లో నిపుణులు.. రాజకీయ నాయకులు కూడా అయితే.. ఇక విమర్శలు చాలా సూటిగానూ పదునుగానూ ఉంటాయి.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సైకాలజిస్ట్ ఎన్ బి సుధాకర్ రెడ్డి విమర్శలు ప్రస్తుతం అదేరీతిగా ఉన్నాయి. ఆయన వైసీపీ నేతల తీరును ఎండగడుతున్నారు. ప్రత్యేకించి.. ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ.. ఎన్ బి సుధాకర్ రెడ్డి ఎద్దేవా చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని, పరిషత్ ఎన్నికల ఫలితాలను చూసి వైకాపాకు 70 శాతానికి ఓట్లు పెరిగాయని చెప్పడమే ఇందుకు తార్కాణమని సుధాకర్ రెడ్డి అంటున్నారు. టిడిపి బహిష్కరించిన ఎన్నికల్లో అక్రమ మార్గంలో సాధించిన గెలుపును చూసి అయన భ్రాంతిలో ఉన్నారన్నారు.
వాపును చూసి బలుపు అనుకోవడం కూడా మతి భ్రమగానే భావించాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జగన్ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్నందున, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా టిడిపి అధికారంలోకి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
సజ్జల ఒకసారి క్లినికల్ సైకాలజిస్ట్ వద్ద పరీక్షలు చేయించుకుని,అవరమైతే సైకియాట్రిస్ట్ ద్వారా చికిత్స చేయించు కోవాలని సలహా ఇచ్చారు. అయన మతిలేని సలహాల వల్లనే ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తప్పుడు నిర్ణయాలు తీసుకుని సమస్యలు కొని తెచ్చు కుంటున్నారన్నారు.
.

Discussion about this post