ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొత్త ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ పదవీకాలం సెప్టెంబరు 30న ముగుస్తుంది. ఆయన స్థానంలో సమీర్ శర్మ అక్టోబరు 1వ తేదీనుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.
సమీర్ శర్మ 1985 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం రాష్ట ప్రణాళిక శాఖ స్పెషల్ ప్రిన్సిపుల్ సెక్రటరీగా ఉన్నారు.
ఆదిత్యనాధ్ దాస్ పదవీకాలం జూన్ నెలతోనే ముగిసింది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన పదవీకాలాన్ని మూడు నెలలపాటు పొడిగిస్తూ కేంద్రం అనుమతించింది. ఆ పొడిగింపు పదవీకాలం కూడా.. సెప్టెంబరు 30కి ముగుస్తుండడంతో కొత్త సీఎస్ ఎంపిక అనివార్యం అయింది.
.