పొరుగు రాష్ట్రంలో విస్తరిస్తున్న పింక్ ఫ్లూ వైరస్ ఆంధ్ర ప్రదేశ్ లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకుండా ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వంలోని పెద్దలు ప్రకటించారు.
ఇటీవలి కాలంలో పొరుగు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో పింక్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ ముఖ్యంగా వీధి కుక్కలకు, పందులకు సోకుతోంది. వైరస్ బారిన పడ్డ కుక్కలకు తట్టుకోలేని ఆకలి, పందులకు విపరీత దాహము వేస్తున్నట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు. వైరస్ సోకిన శునకాలకు తక్షణమే మాంసాహారం తినిపించాలని లేని పక్షంలో అవి మనుషులను ముఖ్యంగా పసిపిల్లలను కాటేసి పీక్కోని తింటాయని తెలిపారు. ఇప్పటికే ఇటువంటి దాడులు నిత్యకృత్యమైనట్లు నివేదికలు అందుతున్నాయి.
పింక్ ఫ్లూ వైరస్ సోకిన పందులు కూడా అకస్మాత్తుగా వింతగా ప్రవర్తిస్తూ మాటు వేసి మహిళల మీద దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది తాత్కాలిక రోగ లక్షణమే అని, బాధిత మహిళలు అధైర్య పడకుండా తట్టుకోవాలని అక్కడి అధికారులు సూచిస్తున్నారు.
పింక్ ఫ్లూ వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే పింక్ ఫ్లూ వైరస్సును ఎదుర్కోవాలే తప్ప దాని బారిన పడ్డ కుక్కలను, పందులను ద్వేషించరాదని కొందరు అభ్యుదయ వైద్యులు సూచిస్తున్నారు. పోరాటం రోగంతోనే కానీ రోగులతో కారాదని హెచ్చరిస్తూ వారు చైతన్య ఉద్యమాన్ని చేపట్టారు.
ఈ పరిణామాలన్నీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం పరిశీలిస్తోందని, వైరస్ రాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నారని అధికారులు చెప్పారు. ప్రజలు కూడా శునక-వరహాలను ఒక కంట కనిపెడుతూ తమకు సహకరించాలని వారు కోరారు.
..మర్యాద రామన్న
Discussion about this post