జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం క్రింద లబ్ధిదారులకు రుణ విముక్తి ధృవీకరణ పత్రాన్ని వరదయ్యపాలెం మండలం సి ఎల్ యన్ పల్లి సర్పంచ్ దుడ్డు వేణు అందచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని గురించి సర్పంచ్ వేణు గోపాల్ మాట్లాడుతూ సి ఎల్ యన్ పంచాయతీ లో గతంలో పక్క ఇళ్లు పొందిన లబ్దిదారులు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద పదివేలు రూపాయలు చెల్లించినయడల పూర్తిస్థాయి రుణమాఫీతో పాటు ఇళ్లు-స్థలానికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుస్నట్లు తెలిపారు.
దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి అని సచివాలయ సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా వారు సి ఎల్ యన్ పల్లి పంచాయతీ లక్ష్మిపురం గ్రామానికి చెందిన దొడ్డి వెంకటమ్మ W/O భాస్కర్ అనే లబ్దిదారునికి రుణ విముక్తి దృవీకరణ పత్రాని అందచేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చిట్టిబాబు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గౌతమ్, వెల్ఫైరే అసిస్టెంట్ కదేష్, డిజిటల్ అసిస్టెంట్ అషా, సర్వేయర్ చందు మరియు వాలంటీర్స్ మరియు లబ్దిదారులు పాల్గొన్నారు.
.

Discussion about this post